డీప్ ఫేక్ అంటే తెలుసా? అది కూడా ఒక రకమైన సాఫ్ట్ వేర్. కాకపోతే, దాని సాయంతో ఎంత చక్కగా ఫేక్ చేయవచ్చంటే… చూసేవారు రియల్ అనే అనుకుంటారు! మనకు నచ్చిన వీడియోలో మనం కావాలనుకున్న వారి మెడకి… ఏ తలకాయ అయినా బిగించవచ్చు! అదే చేశాడు ఓ హాలీవుడ్ మూవీ లవ్వర్…
డీప్ ఫేక్ ట్రైలర్స్ ఈ మధ్య ఊపందుకున్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో ఓ నెటిజన్ ‘గ్లాడియేటర్ 2’ ట్రైలర్ విడుదల చేశాడు! అంతే కాదు, ‘గ్లాడియేటర్’ ఒరిజినల్ మూవీలో రసెల్ క్రో్వే ఉంటే… ఈ తాజా సీక్వెల్ లో గ్లాడియేటర్ వీరుడిగా క్రిస్ హెమ్స్ వర్త్ కనిపించాడు. వీడియో తయారు చేసిన నెటిజన్ డీప్ ఫేక్ పద్ధతిలో రసెల్ క్రోవే బాడీకి క్రిస్ హెమ్స్ వర్త్ హెడ్ అటాచ్ చేశాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్ లో చాలా మంది చూస్తున్నారు. పూర్తి సహజంగా ఉందని చెప్పలేం. కానీ, క్రిస్ హెమ్స్ వర్త్ తో ‘గ్లాడియేటర్ 2’ తీస్తే ఎలా ఉంటుందో మాత్రం ఒక ఐడియా వచ్చేలా ఉంది ఫ్యాన్ మేడ్ ట్రైలర్!
డీప్ ఫేక్ ట్రైలర్ సంగతి ఎలా ఉన్నా దాదాపు ఇరవై ఏళ్ల కింద విడుదలైన ‘గ్లాడియేటర్’ సీక్వెల్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అప్పట్లో కమర్షియల్ సక్సెస్ తో పాటూ రసెల్ క్రోవే మూవీ ఆస్కార్లు కూడా గెలుచుకుంది. అయితే, సినిమా చివర్లో హీరో చనిపోతాడు. మరి సీక్వెల్ లో ఏం జరిగితే బావుంటుంది? దీనిపై చాలా చర్చలే సాగుతున్నాయి. కొందరైతే ‘గ్లాడియేటర్’ చనిపోలేదని ఆడియన్స్ ని కన్విన్స్ చేసేలా ఏదైనా ట్విస్ట్ ఇచ్చి హీరోని సమాధి నుంచీ లేపాలని అంటున్నారు! అలా కాకుండా ఇంకా ఏదైనా మలుపుని సృష్టించి కథని మరో ‘గ్లాడియేటర్’తోనూ కొనసాగించవచ్చు. దర్శకుడు రిడ్లీ స్కాట్ కూడా సీక్వెల్ కు అనుకూలంగానే ఉన్నాడట. ఆయన మదిలోనూ ‘గ్లాడియేటర్ 2’ కదలాడుతోందట. చూడాలి మరి, ఎన్నాళ్లకు… ఎన్ని ఏళ్లకు… సీక్వెల్ వర్కవుట్ అవుతుందో…