దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక జూన్ మొదటి వారం నుంచి దేశమంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశంలో జ్వరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాలం మారుతున్న నేపథ్యంలో వాతావరణం కూడా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో జ్వరాలు కాస్త తక్కువగా ఉంటాయి. వర్షాలు వచ్చేసరికి సీజనల్ వ్యాధులు కొన్ని వచ్చే […]
టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికీ ఆప్తుడైన బీఏ రాజు ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించిన బీఏ రాజు.. చాలా మంది అగ్ర నటులకు పీఆర్‌ఓగా వ్యవహరించారు. దీంతోపాటు ఆయన పలు సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమాల అప్డేట్స్ విషయంలోనూ చాలా మంది ఆయన్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు. కాగా, ఆయన కుమారుడు శివ కుమార్ తండ్రి మరణం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రికి సంబంధించిన […]
కరోనా వైరస్ రెండో దశ దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. సినిమారంగంలోనూ ప్రముఖుల మరణాలు ఎక్కువే అవుతున్నాయి. షూటింగులు లేక సీనీ కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈ కష్టకాలంలో ఆదుకొనేందుకు ముందుకు వస్తున్నారు సినీప్రముఖులు. గత కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా చెక్కులు అందిస్తున్నారు. తాజాగా సీనియర్ సినీ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్ కు కూడా చిరు రూ.50 వేల ఆర్థికసాయం అందించారు. కష్టంలో మమ్మల్ని ఆదుకున్నందుకు చిరంజీవికి రుణపడి ఉంటామని భరత్ భూషణ్ […]
మంచిర్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిలో దందా కూడా ఎక్కువే అవుతుంది. రీసెంట్ గా బ్లాక్ లో అధిక ధరలకు మందులు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన మంచిర్యాల పోలీసులు.. తాజాగా రహస్యంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. జిల్లాలో ప్రైవేటు ల్యాబ్ లు డయాగ్నస్టిక్ లలో అనుమతి లేకుండా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. బాధితుల వద్ద నుండి ఒక్కో కోవిడ్ టెస్ట్ కు 3 […]
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. ఇక హైదరాబాద్ నగరంలోను కోవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఒక్కో స్మశానంలో రోజుకు 10 కి పైగా మృతదేహాలు వస్తున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. కోవిడ్-నాన్ కోవిడ్ మృతదేహాలను వేర్వేరుగా దహనాలు చేస్తున్నామని చెప్తున్నారు. […]
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల కొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి బలపడి మే 24 నాటికి తుపానుగా, తరువాతి 24 గంటల్లో అతి తీవ్రమైన తుపానుగా మారనుంది. దీంతో.. తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ […]
కరోనా పరిస్థితులు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో తెలియదని పరిస్థితి నెలకొంది. దీంతో థియేటర్లు సైతం ఇప్పట్లో తెరచుకొనే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న సినిమాలకి ఒక్కటే ఆప్షన్ ‘ఓటీటీ’.. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయ్యి ఆదరణ పొందగా.. మరిన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ‘వరుడు కావలెను’ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగశౌర్య-రీతువర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ప్లేబ్యాక్ సింగర్‌గా అనేక సినిమాలకు పాటలు పాడిన ఆయన తనదైన గాత్రంతో శ్రోతలను మెప్పించారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా వరుస మరణాలతో టాలీవుడ్ లో తీవ్ర […]