టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికీ ఆప్తుడైన బీఏ రాజు ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించిన బీఏ రాజు.. చాలా మంది అగ్ర నటులకు పీఆర్‌ఓగా వ్యవహరించారు. దీంతోపాటు ఆయన పలు సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమాల అప్డేట్స్ విషయంలోనూ చాలా మంది ఆయన్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు. కాగా, ఆయన కుమారుడు శివ కుమార్ తండ్రి మరణం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. తండ్రికి సంబంధించిన వెబ్ సైట్స్ నిర్వహణ మరియు ఆయన దగ్గర పనిచేస్తున్న పి.ఆర్ టీమ్ తోనే నడవనున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి శ్రేయోభిలాషులకు, సినీ ప్రముఖులకు, మీడియా మిత్రులకు ఆయన తండ్రి బీఏ రాజు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
గౌరవనీయులైన తెలుగు సినీ ప్రముఖులకు, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు విన్నపం…
— BA Raju's Team (@baraju_SuperHit) May 23, 2021
– శివ కుమార్ బి.
(S/O బి.ఎ. రాజు)
@shivakumar2204 pic.twitter.com/Bo5XI3RGvL