దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో మరోవైపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక జూన్ మొదటి వారం నుంచి దేశమంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశంలో జ్వరాలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాలం మారుతున్న నేపథ్యంలో వాతావరణం కూడా మారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో జ్వరాలు కాస్త తక్కువగా ఉంటాయి. వర్షాలు వచ్చేసరికి సీజనల్ వ్యాధులు కొన్ని వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రధానంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుందని.. అయితే జ్వరం వచ్చిన ప్రతిసారి కూడా కరోనా టెస్ట్ కి వెళ్లడం అనవసరమని తెలియచేస్తున్నారు.