తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ ప్లే బ్యాక్ సింగర్ ఏవీఎన్ మూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. ప్లేబ్యాక్ సింగర్‌గా అనేక సినిమాలకు పాటలు పాడిన ఆయన తనదైన గాత్రంతో శ్రోతలను మెప్పించారు. ఏవీఎన్ మూర్తి కుమారుడు శ్రీనివాస మూర్తి ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఏవీఎన్ మూర్తి మృతిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా వరుస మరణాలతో టాలీవుడ్ లో తీవ్ర విషాదాలను నెలకొంటున్నాయి.