కరోనా వైరస్ రెండో దశ దేశవ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తోంది. సినిమారంగంలోనూ ప్రముఖుల మరణాలు ఎక్కువే అవుతున్నాయి. షూటింగులు లేక సీనీ కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఈ కష్టకాలంలో ఆదుకొనేందుకు ముందుకు వస్తున్నారు సినీప్రముఖులు. గత కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయంగా చెక్కులు అందిస్తున్నారు. తాజాగా సీనియర్ సినీ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్ కు కూడా చిరు రూ.50 వేల ఆర్థికసాయం అందించారు. కష్టంలో మమ్మల్ని ఆదుకున్నందుకు చిరంజీవికి రుణపడి ఉంటామని భరత్ భూషణ్ కృతజ్ఞతలు తెలిపారు.