కరోనా పరిస్థితులు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో తెలియదని పరిస్థితి నెలకొంది. దీంతో థియేటర్లు సైతం ఇప్పట్లో తెరచుకొనే అవకాశం కనిపించడం లేదు. ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న సినిమాలకి ఒక్కటే ఆప్షన్ ‘ఓటీటీ’.. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అయ్యి ఆదరణ పొందగా.. మరిన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టడానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా ‘వరుడు కావలెను’ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాగశౌర్య-రీతువర్మ జంటగా నటించిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట. ఇందుకోసం హీరో నాగశౌర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, మేకర్స్‌కు నచ్చిన డీల్ రాగానే ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.