బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. కొన్నాళ్ల క్రితం అతడ్ని తమ సినిమా నుంచీ తొలగిస్తున్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కరణ్ జోహర్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మిస్తోన్న ‘దోస్తానా 2’లో కార్తీక్ కి ఛాన్స్ మిస్ అయింది. పైగా ఆ సినిమాలో కొంత భాగం యంగ్ హ్యాండ్సమ్ తో ఇప్పటికే షూట్ చేశారు కూడా. అయినా, ‘క్రియేటివి డిఫరెన్సెస్’ పేరుతో అతడ్ని తొలగించారు. ఇక ఇప్పుడు కార్తీక్ చేతిలోంచి మరో భారీ బ్యానర్ సినిమా మిస్ అయింది…
షారుఖ్ ఖాన్ ‘రెడ్ చిల్లీస్’ సంస్థ పలు చిత్రాలు నిర్మిస్తూ ఉంటుంది. వాటిల్లో ఒకటిగా ఇంత కాలం కార్తీక్ ఆర్యన్, అజయ్ బాల్ సినిమా ప్రచారం అవుతూ వచ్చింది. అయితే, దర్శకుడు అజయ్ బాల్ తనకు చెప్పిన కథకి, తరువాత సిద్ధమైన స్క్రిప్ట్ కి వైరుధ్యాలు ఉండటంతో కార్తీక్ సినిమాకి నో చెప్పాడట. బాలీవుడ్ లో ప్రచారమవుతోన్న మరో వాదన ప్రకారం… కార్తీక్ ఆర్యన్ ఈ మధ్యే ‘ధమాకా’ అనే మూవీ చేశాడు. రెడ్ చిల్లీస్ మూవీ కూడా దాదాపు అదే జానర్ లో ఉండటంతో యంగ్ టాలెంటెడ్ హీరో వద్దనుకున్నాడట. అయితే, ఇవన్నీ పైపైన చెబుతోన్నవే తప్ప ఇందులో నిజం లేదని కూడా కొందరంటున్నారు. కరణ్ జోహర్, షారుఖ్ ఎలాంటి మిత్రులో అందరికీ తెలిసిందే. అదే అసలు కారణం అంటున్నారు!
కార్తీక్ కి కరణ్ తో వ్యవహారం చెడటంతో కింగ్ ఖాన్ బ్యానర్ కూడా దూరం పెట్టిందని ముంబైలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి, సుశాంత్ మరణం తరువాత కరణ్ జోహర్, అతడితో సన్నిహితంగా ఉండే వారందర్నీ నెపోటిజమ్ గ్యాంగ్ గా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కంగనా లాంటి వారు పబ్లిక్ గా మాటల దాడి చేస్తున్నారు. మరి కార్తిక్ వ్యవహారంలోనూ నెపోటిజమ్ యాంగిల్ చొచ్చుకొస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!