నూతన ఐటీ నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది వార్నింగ్ అనంతరం ట్విట్టర్ వెనక్కి తగ్గింది. మొదట ససేమిరా అన్న ట్విట్టర్.. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధమేనని తెలిపింది. అయితే, వాటి అమలుకు మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఐటీ చట్టాల అమలుకు కొంత సమయం కావాలని ట్విట్టర్ యాజమాన్యం కోరింది. కాగా చివరి అవకాశం ఇస్తూ కేంద్రం రాసిన ఘాటు లేఖకు సానుకూలంగా స్పందించింది. కొత్త ఐటీ నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ట్విట్టర్ వెల్లడించింది.