దేశవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి ఇంధన ధరలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడంతో పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరుగుతోన్నఇంధన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ.30 పైసలు, డీజిల్ పై రూ.31 పైసలు పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 96.04గా ఉంది. మే 4 నుంచి ఏడు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్, కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ.100 మార్క్ దాటేశాయి.