తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. ఆతర్వాత సిద్దిపేట పట్టణ శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీష్ రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం నిర్వహించనున్నారు.