న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని నటన అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ రీమేక్ లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నానిపై ప్రశంసలు కురిపించారు. నాని జెర్బీ మూవీలో అద్భుతంగా నటించాడని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూస్తున్న సమయంలో నాని తనను నాలుగైదు సార్లు ఏడిపించాడని.. తన హృదయానికి దగ్గరైన సినిమాలలో జెర్సీ సినిమా ఒకటని షాహిద్ అన్నారు. అంతకుముందు అసలు కథే లేని సినిమాలు చాలానే చేశానన్నాడు. కానీ జెర్సీ సినిమా చూశాక ఎలాంటి కథలను ఎంచుకోవాలనేది బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడు.