నేటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయాయి. మొదటి విడతగా లింగంపల్లి నుంచి ఫలక్ నుమా, ఫలక్ నుమా నుంచి లింగంపల్లి వరకు వీటిని నడపనున్నారు. ముందుగా 10 ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు. క్రమంగా ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రతి రోజూ 10 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫలక్‌నుమా […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వాటిలో రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లు ఉన్నాయి. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఒడిసాలో సెంచరీ కొట్టింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.97.50, డీజిల్ రూ.88.23కు […]
మెగా ఫ్యామిలీ యంగ్ హీరోస్ సంఖ్య క్రికెట్ టీమ్ ను తలపిస్తుంది. కొణిదెల అండ్ అల్లు ఫ్యామిలీని చూస్తే మెగాభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది. దీనికి తోడు చిరు మేనల్లుళ్ళు సైతం హీరోలుగా రాణిస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఇంతకూ విషయం ఏమంటే… గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు బ్రేక్ పడగానే డిసెంబర్ 25న వరుణ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ విడుదలైంది. కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నా… వెనకడుగు […]
థియేటర్ల కలెక్షన్ల స్థానంలో ఇప్పుడు సోషల్ మీడియా రికార్డులు వచ్చి చేరాయి. లైక్స్, షేర్స్, ఫాలోవర్స్… సంఖ్యను ప్రదర్శిస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరైనా స్టార్ హీరో బర్త్ డే వస్తే… కామన్ డీపీ కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి అనేది చూడటం ఎక్కువైపోయింది. అలానే ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్ వీడియోస్ విడుదలైనప్పుడూ ఇదే తతంగం. తాజాగా విజయ్ ఫ్యాన్స్ అతని బర్త్ డే సందర్భంగా ఓ నయా రికార్డ్ ను […]
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందా అని గట్టిగా అడిగితే లేదనే లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణాలో ఇంకా రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మన దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ విషయంలో నితిన్ ముందున్నాడు. ‘మాస్ట్రో’ బాలెన్స్ షూటింగ్ చకచకా పూర్తి చేసేశాడు. అలానే రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ సైతం చాలా కాలం తర్వాత […]
సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ సినిమా రంగానికి అనుబంధంగా ఉండే మరో రంగంలోకి అడుగుపెట్టబోతోంది. నిజానికి ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది. కానీ లేట్ ఈజ్ బెటర్ దేన్ నెవ్వర్ అన్నట్టుగా ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం కూడా హర్షదాయకమే. ఇంతకూ విషయం ఏమిటంటే… మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేశ్ ప్రొడక్షన్స్ అడుగుపెడుతోందట. చిత్ర నిర్మాణం, స్టూడియో నిర్వహణ, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్విప్ మెంట్స్, అవుట్ డోర్ యూనిట్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్… ఇలా సినిమాకు సంబంధించిన అన్ని శాఖలలోనూ […]
టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ఈ మధ్యనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి చేసుకొని సెట్ అవుదామనుకునే లోపే లాక్ డౌన్ అమలులోకి రావడంతో పెళ్లి వాయిదా వేసుకుంది. దీంతో మెహ్రీన్ పరిస్థితులన్నీ చక్కబడ్డాకనే పెళ్లి అంటూ ఈమధ్యనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేద్దాం అనుకొనే లేపే.. నందమూరి బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా […]
కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు అల్లు శిరీష్. వర్కవుట్స్ ఎలా చేయాలి? ఫిట్‌గా ఎలా ఉండాలి? అనే విషయంపై ఇప్పుడు ఈ హీరో అందరికీ తన వీడియోల ద్వారా మోటివేషన్ ఇస్తున్నాడు. అలాగే తన వర్కవుట్స్ ఎలా సాగుతున్నాయో తెలియచేస్తూ, ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం తాను చేసిన ప్రయత్నంలోని ప్రయాణం గురించి ఓ వీడియోను విడుదల చేసారు శిరీష్. ట్రైనింగ్ డే పేరుతో సోషల్ మీడియాలో అల్లు శిరీష్ ఓ ఫిట్ నెస్ వీడియోను అప్‌లోడ్ […]
ప్రముఖ నటి, తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యియి. తమిళంలో కట్స్ ఏవీ లేకుండానే ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. అతి త్వరలోనే తెలుగు, హిందీ వర్షెన్స్ సెన్సార్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. జయలలిత జయంతి సందర్భంగా 2019 ఫిబ్రవరి 24న ఈ సినిమాను ప్రారంభించారు. Also Read: జలకాలాటలలో శ్రియ సరన్.. లేటెస్ట్ హాట్ […]