జగిత్యాల జిల్లాలో ఓ ప్రేమికుడు పెట్రోల్ బాటిల్‌తో పోలీస్ స్టేషన్ ముందు హల్‌చల్ చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని దగ్గరకు వస్తే నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడుతానని హెచ్చరించాడు. అరగంటపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. కరీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమిస్తే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనిని ఆందోళన వ్యక్తం చేశాడు. జగిత్యాలకు చెందిన వెంకటరమణ ప్రేమ పేరుతో తమ కూతురును వేధిస్తున్నాడని యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంకటరమణను పోలీస్ స్టేషన్‌కు పిలువగా భయాందోళనకు గురైన ప్రేమికుడు పెట్రోల్ బాటిల్ తో స్టేషన్‌కు వచ్చి హంగామా చేశాడు. కాసేపయ్యాక కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.