ప్రపంచంలోని చాలా సినీ పరిశ్రమలు కరోనా కారణంగా దెబ్బతిన్నాయి. కానీ, హాలీవుడ్ మాత్రం ఒకింత తక్కువ నష్టమే చవి చూసింది. ఎందుకంటే, ఇతర భాషల్లోని ఏ సినిమాలు వాడుకోనంతగా ఓటీటీ ప్లాట్ పామ్స్ ని హాలీవు్డ్ చిత్రాలు ఉపయోగించుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా, నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు హాలీవుడ్ టాప్ స్టార్స్ అండ్ డైరెక్టర్స్ కి కూడా సరికొత్త వేదిక అయిపోయింది… ‘300’ లాంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అందించిన జాక్ స్నైడర్ కు పెద్ద తెరపై […]
గత వారం పదహారు చిత్రాలతో సందడి చేసిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ శుక్రవారం మరో రెండు చిత్రాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ఒక చిన్న విరామం’ కాగా, మరొకటి తమిళ అనువాద చిత్రం ‘విక్రమార్కుడు’. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ‘ఒక చిన్న విరామం’లో పునర్నవి భూపాలం, గరిమ, నవీన్ నేని ముఖ్యపాత్రలు పోషించారు. దీన్ని స్వీయ దర్శకత్వంలో సుదీప్ చెగూరి నిర్మించారు. కథ విషయానికి వస్తే బిజినెస్ […]
తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి మెప్పించారు. అక్కినేని ‘దేవదాసు’ చూసిన దిలీప్, “ఏయన్నార్ ఇంత బాగా చేశారని తెలిస్తే, నేను నటించడానికి అంగీకరించేవాణ్ణే కాదు” అని కితాబు నిచ్చారు. అదే తీరున దిలీప్ ‘దేవదాస్’ చూసిన అక్కినేని, “మా ‘దేవదాసు’లో హీరోని ప్రేమికునిగా చిత్రీకరించారు. అసలైన ఆత్మ దిలీప్ ‘దేవదాస్’లోనే ఉంది” అంటూ […]
ప్రముఖ నిర్మాత, పవన్ భక్తుడు బండ్లగణేష్ హాస్యనటుడిగా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు పొందాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో చివరిగా నటించిన బండ్ల.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా, ఇదివరకే ఆయన హీరోగా మారబోతున్నట్లు వార్తలు వచ్చిన బండ్ల ఖండించారు. అయితే తాజాగా బండ్ల.. వెంకట్ అనే కొత్త దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వినోదభరితంగా సాగే ఈ […]
(జూలై 8న రేవతి పుట్టినరోజు) చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కాసింత పరిచయం కాగానే యెద చుట్టేసుకుంటుంది. కళ్ళతోనే కోటి భావాలు పలికిస్తుంది. పెదాలు విప్పితే ఆమె ముత్యాల పళ్ళు పలకరిస్తాయి. వెరసి నటి రేవతి నవ్వు ఆకర్షిస్తుంది. అభినయం ఆకట్టుకుంటుంది. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించేసి ప్రేక్షకుల […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా గుర్తుండిపోయే చిత్రాలుగా రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి కథానాయికపై రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా మరో సీనియర్ కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. లేడీ సూపర్ స్టార్ […]
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ రోగులకు సేవలు అందించే విషయంలో మరో ముందడుగు వేసింది. బుధవారం ఒకటో నంబర్ బ్లాక్ సెల్లార్ లో కొత్త డే-కేర్ యూనిట్ 3ని హాస్పిటల్ కమిటీ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. కిమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్స్ కు సేవలు అందించడంలో తమ సంస్థ మరో మైలు రాయిని అధిగమించిందని ఆయన అన్నారు. తమ ప్రయాణంలో నిరంతరం సేవలను మెరుగుపరుచుకుంటూ, మరిన్ని సౌకర్యాలను పేషెంట్స్ […]
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండాలని, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానించినట్టు సునీల్ నారంగ్ తెలిపారు. అగ్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సైతం […]
‘ఉస్తాద్’ రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్‌లో శ్రీనివాస్ చిట్టూరి తీస్తున్న ద్విభాషా చిత్రం రెగ్యులర్ షూటింగ్ 12 నుంచి ఆరంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఊర మాస్ సినిమాగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. రామ్ తొలి బైలింగ్వల్ సినిమా ఇది. ‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన లింగుసామి తీస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీశెట్టి హీరోయిన్‌గా నటించనుంది. ‘దృశ్యం’, […]