12 నుంచి రామ్-లింగుసామి సినిమా రెగ్యులర్ షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఉస్తాద్’ రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్‌లో శ్రీనివాస్ చిట్టూరి తీస్తున్న ద్విభాషా చిత్రం రెగ్యులర్ షూటింగ్ 12 నుంచి ఆరంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఊర మాస్ సినిమాగా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. రామ్ తొలి బైలింగ్వల్ సినిమా ఇది. ‘రన్’, ‘ఆవారా’, ‘పందెంకోడి’ వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన లింగుసామి తీస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. రామ్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీశెట్టి హీరోయిన్‌గా నటించనుంది. ‘దృశ్యం’, ‘లూసిఫర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అన్బు- అరివు యాక్షన్ కొరియోగ్రఫీ చేయనున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి మాట్లాడుతూ ‘‘లింగుసామి చెప్పిన పవర్‌ఫుల్ ఊర మాస్ సబ్జెక్ట్ మా అందరికీ నచ్చి రామ్‌కి వినిపించాం. పుల్ నేరేషన్ విన్న రామ్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లవ్ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేశారు. మా బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో తెలుగు, తమిళ భాషల్లో ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నాం. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం’’ అన్నారు.
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
తాజావార్తలు
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!