టాలీవుడ్ హీరో రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఈ చిత్రంలో రామ్ ఇదివరకు చూడని కొత్త గెటప్ లో కనిపించనున్నారట. పవన్ కుమార్ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ మూవీపై రామ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈమధ్యే షూటింగ్ స్టార్ట్ చేద్దామా అంటూ పోస్ట్ కూడా చేశారు. అయితే తాజా సమాచారం […]
రమేష్ ఉడత్తు, గౌరి వాలాజా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వాలాజా క్రాంతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విదార్థ్, ధృవీక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య ప్రధాన పాత్రధారులు. ‘భగత్ సింగ్ నగర్’ అనేది ఓ అందమైన ప్రేమకథా చిత్రమని, […]
ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం నిర్మిస్తోంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు అతనితోనే మరో చిత్రాన్ని మొదలు పెట్టింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దేవుని పటాలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ ను చిత్ర దర్శకుడు శౌరి […]
ఈమధ్య కాలంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డగ్స్, బంగారం పట్టివేత భారీగా జరుగుతోంది. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా డ్రగ్స్, బంగారం సరఫరా చేస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బహ్రయిన్ ప్రయాణీకుడి వద్ద రెండు కేజీలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని కరిగించి పేస్టుగా చేసి కాళ్లకు వేసుకునే సాక్స్ లోదాచాడు కేటుగాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలల్లో […]
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ-ఓపెన్ కానున్న నేపథ్యంలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు ముస్తాబు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘లవ్ స్టోరీ’ ఈ నెల 30వ తేదీన ఈ […]
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రపరిశ్రమలో రాణించగా.. ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1993లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కించుకున్నాడు. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2015లో […]
రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ జగపతి బాబుది డిఫరెంట్ లైఫ్ స్టైల్.. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారింది. తెలుపు కుర్తా పైజామాలో ఉన్న జగపతిబాబు చేతిలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని గోడపై కూర్చున్న స్టిల్‌ను ట్విటర్ పోస్ట్ చేశారు. అయితే చూడ్డానికి ‘డైనమిక్ పొలిటిషియన్ లా కనిపిస్తున్నారు.. మీరు త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. జగ్గూభాయ్ రిప్లై ఇస్తూ.. […]
(ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు బర్త్ డే సందర్భంగా) ‘కుదరవల్లి శ్రీ రామారావు తెలుసా?’ అంటే ‘ఆయనెవరు?’ అనే ఎదురుప్రశ్న వస్తుంది. అదే ‘కె.యస్. రామారావు తెలుసా?’ అనగానే ‘క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కదా!’ అనే సమాధానం వస్తుంది. జూలై 7న విజయవాడలో హరి పురుషోత్తం, రంగనాయకమ్మ దంపతులకు జన్మించిన కె. ఎస్. రామారావు అసలు పేరు కుదరవల్లి శ్రీ రామారావు. అయితే చిత్రజగత్తులో మాత్రం ఆయన కె.యస్. రామారావుగా ప్రసిద్ధులయ్యారు. ఇవాళ ఆయన జన్మదినం. తెలుగు […]
(మోహనగాంధీ బర్త్ డే సందర్భంగా) ఏ తరహా కథ తన దగ్గరకు వచ్చినా దాన్ని ఆకళింపు చేసుకుని, విజయవంతమైన సినిమాగా మలచడానికి నూరు శాతం కృషి చేసే అరుదైన దర్శకులలో ఎ. మోహనగాంధీ ఒకరు. తెలుగు చిత్రసీమలో కమిట్ మెంట్ అనే పదానికి పర్యాయపదం ఆయన. అందుకే అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన్ని తమ మనిషిగా భావించాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చాయి. నిజం చెప్పాలంటే మోహనగాంధీకి లభించిన విజయాలు మరో దర్శకుడికి […]