దిలీప్ తెలుగు బంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి మెప్పించారు. అక్కినేని ‘దేవదాసు’ చూసిన దిలీప్, “ఏయన్నార్ ఇంత బాగా చేశారని తెలిస్తే, నేను నటించడానికి అంగీకరించేవాణ్ణే కాదు” అని కితాబు నిచ్చారు. అదే తీరున దిలీప్ ‘దేవదాస్’ చూసిన అక్కినేని, “మా ‘దేవదాసు’లో హీరోని ప్రేమికునిగా చిత్రీకరించారు. అసలైన ఆత్మ దిలీప్ ‘దేవదాస్’లోనే ఉంది” అంటూ ప్రశంసించారు. యన్టీఆర్ ‘అగ్గిరాముడు’ను దిలీప్ కుమార్ తో హిందీలో ‘ఆజాద్’గా తెరకెక్కించారు.
Read Also: ‘పుష్ప’ రిలీజ్ ‘అప్పుడే’ అంటోన్న టాలెంటెడ్ స్టార్ హీరో…
Also Read
- Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
- Sonia Gandhi: ‘ఎక్స్’లోకి ఎంట్రీ.. రాజీవ్‌తో తొలి భేటీ వివరాలు పంచుకున్న సోనియాగాంధీ
- Himanshu Bhau: అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాంశు భౌ అరెస్ట్.. భారత్‌కు తరలింపు!
- Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
యన్టీఆర్ “రాముడు-భీముడు” చిత్రాన్ని హిందీలో దిలీప్ కుమార్ తో ‘రామ్ ఔర్ శ్యామ్’గా రూపొందించారు. యన్టీఆర్ కు ‘రాముడు-భీముడు’, దిలీప్ కు ‘రామ్ ఔర్ శ్యామ్’ తొలి ద్విపాత్రాభినయ చిత్రాలు కావడం విశేషం. యన్టీఆర్ లాగే దిలీప్ కూడా ఉత్తరాదిన జానపద కథానాయకునిగా వెలుగొందారు. దిలీప్ ‘ఆన్’ చిత్రం ఆధారంగానే యన్టీఆర్ ‘బందిపోటు’ తెరకెక్కడం విశేషం. అలాగే దిలీప్ ‘కోహినూర్’ ఆధారంగా కొన్ని యన్టీఆర్ జానపద చిత్రాల్లోని సన్నివేశాలు రూపొందాయి. దిలీప్ ‘మేలా’ లోని కొన్ని సన్నివేశాలతోనే యన్టీఆర్ ‘చిరంజీవులు’ తెరకెక్కింది. యన్టీఆర్ ‘గుడిగంటలు’ హిందీలో దిలీప్ ‘ఆద్మీ’గా రూపొందింది. దిలీప్ నటించిన ‘మొఘల్- ఏ ఆజమ్’ ఆధారంగానే యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ తెరకెక్కించారు. దిలీప్ ‘గోపీ’ మాతృకగా యన్టీఆర్ తో బి.విఠలాచార్య ‘పల్లెటూరి చిన్నోడు’ తీశారు. యన్టీఆర్ ‘కొండవీటి సింహం’ పోలికలతో దిలీప్ ‘శక్తి’ తెరకెక్కింది.
Read Also: హాట్ నెస్ తో చంపేస్తున్న అక్షర గౌడ… పిక్స్
తెలుగువారయిన కృష్ణంరాజు నిర్మించగా కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘ధర్మాధికారి’లోనూ, బి.గోపాల్ దర్శకత్వంలో ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించిన ‘కానూన్ అప్నా అప్నా’లోనూ దిలీప్ కుమార్ నటించారు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఆధారంగా ‘ధర్మాధికారి’, ‘కలెక్టర్ గారి అబ్బాయి’ రీమేక్ గా ‘కానూన్ అప్నా అప్నా’ రూపొందాయి.
ఇక 1976లో హైదరాబాద్ లో జరిగిన ఛారిటీ క్రికెట్ లో దిలీప్ కుమార్ ఉత్తరాది నటవర్గం పాల్గొన్న టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించగా, దక్షిణాది తారలతో నిండిన జట్టుకు యన్టీఆర్ సారథ్యం వహించారు. యన్టీఆర్ జాతీయ అవార్డును నెలకొల్పిన తరువాత తొలి అవార్డును ఏయన్నార్ 1996లో అందుకోగా, తరువాతి సంవత్సరం 1997లో దిలీప్ కుమార్ అందుకున్నారు. అలా యన్టీఆర్ జాతీయ అవార్డును తొలుత ‘ఇద్దరు దేవదాసులు’ చేజిక్కించుకోవడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!