ఫ్యూచర్ థియేటర్లదే… నిర్మాతలూ ఓటీటీ బాట పట్టకండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండాలని, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానించినట్టు సునీల్ నారంగ్ తెలిపారు. అగ్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపడం బాధాకరమని అన్నారు. తాను కూడా ఓ నిర్మాతనేనని, అయితే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరంగా ఉన్న ఈ సమయంలో నిర్మాతలు సైతం సంయమనం పాటించాలని, ఎగ్జిబిటర్స్ కష్టాలను గుర్తించాలని కోరారు.
తెలంగాణలో 600, ఆంధ్రప్రదేశ్‌లో 1100 థియేటర్లు ఉన్నాయని, మొన్నటి వరకూ ఆ థియేటర్ల నుండి ఆదాయాన్ని పొందిన నిర్మాతలు ఇప్పుడు కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో ఓటీటీ దారి పట్టడం కరెక్ట్ కాదని విజయేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంచి క్వాలిటీ సౌండ్ తో, సౌకర్యవంతంగా సినిమాలను థియేటర్లలో చూస్తే లభించే తృప్తి వేరని, అది ఓటీటీలో చూడటం వల్ల దక్కదని, అందువల్లే ఇటీవల ఓటీటీలో వచ్చిన పెద్ద చిత్రాలకు ఆదరణ కరువైందని ఆయన అభిప్రాయ పడ్డారు. థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత ఓటీటీలోనూ, శాటిలైట్ ఛానెల్స్ లోనూ ప్రసారం చేసుకుంటే… నిర్మాతకే అదనపు లాభాలు దక్కుతాయని, వాటిని కాదని ఓటీటీని ఎంచుకుంటే… రాబోయే రోజుల్లో తమ నిర్ణయాలు సైతం తీవ్రంగా ఉండే ఆస్కారముందని కొందరు సభ్యులు సుతిమెత్తగా హెచ్చరించారు. మరి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ తీర్మానం పట్ల మన నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!