‘అక్టోబర్ నెలాఖరు వరకూ ఏ నిర్మాత తమ చిత్రాలను ఓటీటీలకు ఇవ్వకూడదం’టూ ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్ ఇటీవల తీర్మానం చేసింది. అయితే… దానికంటే ముందే ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన బ్యానర్ లో ఇతరులతో కలిసి నిర్మిస్తున్న ‘నారప్ప, దృశ్యం -2, విరాట పర్వం’ చిత్రాలను ఓటీటీ రిలీజ్ కు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ఛాంబర్ సర్వ సభ్య సమావేశంలోనూ సభ్యులు సురేశ్ బాబును టార్గెట్ చేస్తూ […]
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ మహిళా ఎంపీడీవో విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. మంత్రి తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రులకు సభ్యత సంస్కారం లేదని మరోసారి స్పష్టం అయిందని తెలిపారు. ఎర్రబెల్లి ఒక మహిళా ఉద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాజిటివ్ కాంటెక్స్ట్ లో అలాంటి […]
‘అయిపోయిందేదో అయిపోయింది… ఇక సమయం వృధా చేసుకోదల్చుకోలేదు’ అంటున్నారు ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్. ఆయన మెగాఫోన్ పట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తోంది. తొలి చిత్రం ‘ఆది’ 2002లో విడుదలైంది. విశేషం ఏమంటే… దర్శకుడైన ఇరవై సంవత్సరాలకు వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అదీ ‘ఛత్రపతి’ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ రీమేక్ తో. ఈ సినిమా పట్టాలెక్కే విషయంలోనూ రకరకాల పుకార్లు షికారు చేసినా, హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ […]
పెళ్లి తరువాత మిసెస్ కిచ్లూ ప్రయోగాలకి ఉత్సాహంగా సిద్ధపడుతోంది. గతంలో కేవలం గ్లామర్ పాత్రలే చేసిన కాజల్ ఇప్పుడు రిస్క్ తీసుకోవటానికి రెడీ అవుతోంది. సినిమాలు, సీరియల్స్ ఒకేసారి హ్యాండిల్ చేస్తోన్న టాలెంట్ బ్యూటీ రీసెంట్ గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘రౌడీ బేబీ’ పేరుతో తెరకెక్కే ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అంటున్నారు. Read Also: లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి…! కాజల్ కి హారర్ జానర్ కొత్తేం కాదు. అయితే, […]
వెండితెరపై హీరోగా కనిపించటం అంటే బాధ్యత మాత్రమే కాదు. బరువు కూడా! అందుకే, మన హీరోలు… ఆ మాటకొస్తే ఈ తరం హీరోయిన్స్ కూడా… రోజూ జిమ్ లో బరువులు ఎత్తుతుంటారు. కఠినమైన కసరత్తుల వల్ల ఫిట్ నెస్ మాత్రమే కాక మంచి లుక్ కూడా వస్తుంది. యంగ్ హీరోలకి నటన కంటే కూడా కండలు తిరిగిన చక్కటి శరీరం చాలా ముఖ్యం. అదుంటే యూత్ ఆటోమేటిక్ గా ఓ లుక్ వేస్తారు. ఆ తరువాత టాలెంట్ […]
తెలుగు, తమిళంలో నటించిన నమిత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతం, జెమిని, బిల్లా, సింహ లాంటి తెలుగు చిత్రాలలో నటించింది. తనదైన బొద్దు అందాలతో మంచి ఫాలోయర్స్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. 2017లో వీరేంద్రతో ప్రేమవివాహం చేసుకుంది. కాగా, తాజాగా శనివారం ఉదయం నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ దేవస్థానంపై నమిత అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని అన్నారు. మరోవైపు […]
ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేక పోతున్నారు కానీ, అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలచుకొని ఇప్పటికీ పడిపడి నవ్వేవారు ఎందరో ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు, మరికొందరు కసాయితనం చూపించీ ప్రతినాయకులుగానూ మెప్పించారు. ఆ తరహా పాత్రల్లోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తిమీద సాములాంటిది! అలాంటి సాములను అనేకమార్లు అవలీలగా చేసిన […]
(జూలై 9న మహానటుడు గుమ్మడి జయంతి) వందలాది చిత్రాలలో తనకు లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేస్తూ నటించిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అందులో తన జాడ కనిపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్ ఆర్టిస్ట్స్’లో గుమ్మడికి సైతం ప్రత్యేక స్థానం ఉంది. అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటించిన గుమ్మడికి ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రం ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. ఈ చిత్రం ద్వారా […]
తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయం అయింది. ఈరోజు సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎల్.రమణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ… ‘ఎల్.రమణ అంటే కేసీఆర్‌కు అభిమానం అంటూ చెప్పుకొచ్చారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ తెరాసకు అవసరమన్నారు. రమణను తెరాసలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. రమణ సానుకూలంగా స్పందించారని […]
మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘నవరస’. పేరుకి తగ్గట్టుగానే తొమ్మిది రసాలు, భావోద్వేగాలతో కూడిన తొమ్మిది కథలు ఉంటాయంటున్నారు. ‘నవ’ అంటే తొమ్మిదే కాదు… ‘నవ’ అంటే ‘కొత్త’ అని కూడా కదా… ‘నవరస’ యాంథాలజీ సరికొత్తగా ఉంటుందట. శుక్రవారం ఈ వెరైటీ వెబ్ సిరీస్ ప్రోమో విడుదల కానుంది. ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ, ఆగస్ట్ తొమ్మిదిన నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవ్వొచ్చని టాక్ బలంగా […]