మాటల ‘కోట’… నవ్వుల తోట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడంటే కోట శ్రీనివాసరావు వయసు మీద పడడం వల్ల మునుపటిలా నవ్వులు పూయించలేక పోతున్నారు కానీ, అప్పట్లో కోట పండించిన నవ్వుల పంటలు తలచుకొని ఇప్పటికీ పడిపడి నవ్వేవారు ఎందరో ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఎందరో హాస్యనటులు తమదైన అభినయంతో ఆకట్టుకున్నారు. కొందరు కేవలం నవ్వులే కాదు, కన్నీరు పెట్టించారు, మరికొందరు కసాయితనం చూపించీ ప్రతినాయకులుగానూ మెప్పించారు. ఆ తరహా పాత్రల్లోనూ నవ్వకుండా నవ్వులు పూయించడం అన్నది కత్తిమీద సాములాంటిది! అలాంటి సాములను అనేకమార్లు అవలీలగా చేసిన ఘనుడు కోట శ్రీనివాసరావు. ఆయన మాటలు కోటలు దాటుతాయి, కోట్లూ కుమ్మరించాయి. బాక్సాఫీస్ రికార్డులు బీటలు వారేలా చేశాయి. ఎందరికో గెలుపు బాటలూ వేశాయి. అందుకే కోట శ్రీనివాసరావు మాటంటే తెలుగువారికి మహా ఇష్టం.
కలలుంటాయి అందరికీ, అవి నెరవేరేది కొందరికే! కళలన్నవి కొందరికే – అవి నెరవేరాలంటే గుమ్మడి కాయంత ప్రతిభకన్నా ఆవగింజంత అదృష్టం కావాలి అంటారు పెద్దలు. కోట శ్రీనివాసరావులో పేద్ద పనసకాయంత ప్రతిభ ఉంది. కానీ, ఆరంభంలో ఆవగింజంత అదృష్టం వరించలేదు. 1978లో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’తోనే తొలిసారి తెరపై కనిపించారు కోట. అయితే ఆయన నవ్వుల బాట తెలుగువారికి పరిచయం కావడానికి జంధ్యాల మెగాఫోన్ పట్టవలసి వచ్చింది. జంధ్యాల చిత్రాలు కోట అభినయానికి పెద్ద పీట వేశాయి. ప్రతీసారి కోట మార్కు నటన ప్రేక్షకుల చేత మార్కులు వేయించుకుంటూనే సాగింది. హాస్యనటునిగా, గుణచిత్ర నటునిగా పలుమార్లు అవార్డులూ, రివార్డులూ సంపాదించారు కోట. అయితే ప్రతినాయకునిగా నాలుగు సార్లు నందులు అందుకున్న ఘనత ఆయనకు మాత్రమే దక్కింది.
Also Read
- National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో 'క్రిటికల్ థింకింగ్'
- Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
- World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
- Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
తన మాటల తూటాలతో ప్రేక్షకులకు వినోదం పంచిన కోట రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు కోట. తరువాత ఓటమి చవిచూసిన కోట, మళ్ళీ నటనలోనే కొనసాగారు. అయితే, ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. 2015లో కోటకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయప్రవేశం చేసి మునుపటిలా వినోదం పంచాలనే ఉత్సాహంతోనే ఉన్నారాయన. జూలై 10తో 78 ఏళ్ళు పూర్తి చేసుకుంటోన్న కోట శ్రీనివాసరావు మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
-
Sonia Gandhi: “పెళ్లికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే సోనియా గాంధీ”.. ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
-
Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
-
Mother Dairy Milk Price Hike: పాల వినియోగదారులకు షాక్.. లీటరుపై రూ.4 వరకు పెంపు!..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!