ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు లీగల్ అడ్వైజర్ సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.
జమ్మూ, కాశ్మీర్ లోని లదాఖ్ మంచు పర్వతాల్లో నాగ చైతన్య షూటింగ్ చేస్తున్నాడు! ఈ విషయాన్ని స్వయంగా సొషల్ మీడియాలో ప్రకటించిన ‘చే’ ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ తో కలసి తాను దిగిన ఫోటోని షేర్ కూడా చేశాడు! మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందుకే, లదాఖ్ లో ఓ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమాలో ‘బాలా’ అనే పాత్ర పోషిస్తున్న మన […]
‘బాయ్స్’ సినిమాతో హీరో అయిన సిద్ధార్థ్ కోలీవుడ్ లో ఎంత పేరున్న నటుడో టాలీవుడ్ లోనూ అంతే పాప్యులర్. అయితే, ఒక దశలో తెలుగులోనూ డైరెక్ట్ చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్న ‘బొమ్మరిల్లు’ స్టార్ గ్రహాలు కలసి రాకో, స్వయంకృతాపరాధం వల్లో బాగా వెనుకబడ్డాడు. తమిళంలో ఈ ‘హ్యాండ్సమ్ పయ్యన్’ పరిస్థితి ఫర్లేదు అన్నట్టుగానే కొనసాగుతూ వస్తోంది. కాకపోతే, ఈ మధ్య కాలంలో మన లవర్ బాయ్ కి మరోసారి టైమొచ్చినట్టు కనిపిస్తోంది! 2019లో ‘అరువమ్’ […]
తమిళనాడు గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మొత్తం 11 మంది కేంద్ర మంత్రులను మంత్రి మండలి నుంచి తొలగించారు. వారిలో రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. కేబినెట్ విస్తరణకు కొద్ది గంటల ముందే రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయడం ఆసక్తి […]
మాజీ మంత్రి ఎల్.రమణ శుక్రవారం తెలంగాణ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా రమణ ప్రకటించారు. దీంతో టీ-టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. కాగా నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ పార్టీ తెలంగాణ శాఖకు చెందిన కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జీలతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు.. టీటీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా […]
అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 16న విడుదలకావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వాయిదా పడిన సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో లవ్ స్టోరీ కూడా ఆగస్టు […]
శింబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పొలిటికల్ డ్రామా మూవీ ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా నిర్మాత సురేశ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే, మిగతా అన్ని చిత్రాల్లాగే శింబు, కళ్యాణి ప్రియదర్శన్ స్టారర్ ‘మానాడు’ కూడా అనేక వాయిదాలు పడింది గత సంవత్సర కాలంగా. లాక్ డౌన్ వల్ల శింబుకి అగచాట్లు తప్పలేదు. అయితే, 2020 జూలై 10న మొదలైన సినిమా 2021 జూలై 10న ముగిసింది! సేమ్ డేట్ తో ప్రారంభమై సేమ్ […]
అమెరికాలో దేన్నైనా మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు! ఇక క్రిస్మస్ పండగ సంగతి వేరేగా చెప్పాలా? డిసెంబర్ లో వచ్చే అతి పెద్ద పండగ పాశ్చాత్యులకి చాలా ముఖ్యం. అందుకే, ఆ సమయంలో రకరకాలుగా మార్కెట్లో వ్యాపారం మొదలు పెడతారు వ్యాపారులు. వాల్ మార్ట్ లాంటి అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. క్రిస్మస్ సమయంలో కేక్స్ మొదలు పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల దాకా అన్నీ హాట్ కేక్స్ లా అమ్ముడుపోతాయి! అయితే, […]
దిలీప్ కుమార్ మరణంతో ఒక శకం ముగిసింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడిక ఇండియాలో ‘బ్లాక్ అండ్ వైట్’ కాలం నాటి సూపర్ స్టార్స్ లేరనే చెప్పొచ్చు! అటువంటి క్లాసికల్ ఎరా ఐకాన్ తన తుది శ్వాస విడవటంతో…. లివింగ్ లెజెండ్ అమితాబ్ సొషల్ మీడియాలో ఘనమైన నివాళులు అర్పించాడు. కొడుకు అభిషేక్ తో కలసి స్వయంగా దిలీప్ కుమార్ అంత్యక్రియలకు అటెండ్ అయిన ఆయన… సోషల్ మీడియా పోస్టులో… 1960ల నాటి జ్ఞాపకాన్ని నెమర వేసుకున్నాడు. Read […]