ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఓ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబు లీగల్ అడ్వైజర్ సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.