దిలీప్ కుమార్ మరణంతో ఒక శకం ముగిసింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడిక ఇండియాలో ‘బ్లాక్ అండ్ వైట్’ కాలం నాటి సూపర్ స్టార్స్ లేరనే చెప్పొచ్చు! అటువంటి క్లాసికల్ ఎరా ఐకాన్ తన తుది శ్వాస విడవటంతో…. లివింగ్ లెజెండ్ అమితాబ్ సొషల్ మీడియాలో ఘనమైన నివాళులు అర్పించాడు. కొడుకు అభిషేక్ తో కలసి స్వయంగా దిలీప్ కుమార్ అంత్యక్రియలకు అటెండ్ అయిన ఆయన… సోషల్ మీడియా పోస్టులో… 1960ల నాటి జ్ఞాపకాన్ని నెమర వేసుకున్నాడు.
Read Also: ఈ 5 ‘బోల్డ్’ వెబ్ సిరీస్ లు మీరింకా చూడలేదా? అయితే, ‘బోలెడంత’ మిస్ అవుతోన్నట్టే!
అప్పట్లో ముంబైకి వచ్చిన బచ్చన్ ఫ్యామిలీ ఒక హోటల్లో ఉన్నారట. అదే సమయంలో అక్కడికి వచ్చిన దిలీప్ కుమార్ ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతూ కనిపించారట! తన ఫేవరెట్ సూపర్ స్టార్ దగ్గరగా కనిపించటంతో కాస్సేపు అలా బిగుసుకుపోయిన బిగ్ బీ వెంటనే ఆటోగ్రాఫ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ, చేతిలో బుక్ లేకపోవటంతో పరుగున పోయి పుస్తకంతో తిరిగి వచ్చాడు. ఆయనకు పెద్ద రిలీఫ్ కలిగించేలా ఇంకా దిలీప్ కుమార్ అక్కడే ఉన్నారు!
Read Also: తమిళనాడులో లాక్‌డౌన్ మళ్లీ పొడిగింపు
దిలీప్ కుమార్ వద్దకి ఎలాగో ధైర్యం చేసి వెళ్లిన అమితాబ్ బచ్చన్ ఆయన్ని ఆటోగ్రాఫ్ కోసం అడిగాడు కూడా! బుక్ చేతిలో పట్టుకుని వెయిట్ చేశాడు కూడా! కానీ, ఈయన అడిగిన విషయం దిలీప్ కుమార్ కి అర్థం కాలేదో, అసలు ఆయనకి వినపడలేదో ఏమోగానీ… బిగ్ బీని చూడనైనా చూడలేదట! కొద్ది సేపటి తరువాత దిలీప్ అక్కడ్నుంచీ వెళ్లిపోయాడు! అమితాబ్ కు ఆటోగ్రాఫ్ దక్కకున్నా అభిమాన నటుడి దర్శనం దక్కింది!
1960లలో దిలీప్ నుంచీ సంతకం పొందలేకపోయిన అమితాబ్ 1982లో ఆయనతో పాటూ సినిమా చేసేందుకు డైరెక్టర్ రమేశ్ సిప్పీకి సంతకం చేశాడు! ‘శక్తి’ పేరుతో వచ్చిన మల్టీ స్టారర్ లో ఒకే ఒక్కసారి దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ కలసి నటించారు!