బాలీవుడ్ నటి అనన్య పాండే నానమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది. దీంతో ఆమె ఇంట విషాదం నెలకొంది. నానమ్మను అంటిపెట్టుకుని ఉండే అనన్య ఆమె ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా ఆమెకు కన్నీటి నివాళులు అర్పించింది. 85 ఏళ్ల వయసులోనూ తను ఎంతో యాక్టీవ్ గా ఉండేదని.. ఆమె దగ్గర పెరిగినందుకు గర్వంగా ఉందని తెలుపుతూ.. నానమ్మతో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోలను కూడా షేర్ చేసింది. అనన్య పాండే తండ్రి.. […]
టాలీవుడ్ నటి మెహ్రీన్ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు బిష్ణోయ్ తో నిశ్చితార్ధం అనంతరం బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏమైందో, ఏమోగానీ ఇరువురు మధ్య బంధం ఇక కొనసాగడం కష్టమని భావించి విడిపోయారు. నిశ్చితార్ధం తర్వాత వీరిద్దరూ బాగానే కలిసి తిరుగగా.. ప్రస్తుతం మెహ్రీన్ సోలోగా గతాన్ని ఏమాత్రం తలుచుకోకుండా లైఫ్ ని లీడ్ చేస్తోంది. తాజాగా ఆమె బీచ్ లో కొత్త ఉత్సాహం వచ్చినంత ఆనందంగా ఫోటోలను ఇన్ స్టాలో షేర్ […]
కాళేశ్వరంలో మళ్ళీ కరోనా కలకలం రేపింది. గత కొన్ని రోజుల నుండి మరల కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కాళేశ్వరం గ్రామంలోనే 50కి పైన పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముందస్తుగా కాళేశ్వర గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం దేవస్థానంకు వచ్చే భక్తులు గాని, ప్రాజెక్టు సందర్శనకు వచ్చే యాత్రికులు గాని మరియు అస్తికలు కలుపుటకు వచ్చే వారుగాని […]
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ముంపు గ్రామాల్లోను ఆయన పర్యటన కొనసాగనుంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలని.. వెంటనే పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. R&R ప్యాకేజీని వెంటనే అందజేయాలని సోము వీర్రాజు కోరారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ యథావిధంగా పనిచేస్తుందన్న ఆయన.. దానిని అమ్మే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. ఇక కేసీఆర్, […]
ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి కోటకు కేంద్రం తరపున నిధులను మంజూరు చేయాలని కోరారు. 45 నిముషాల పాటు ఈ సమావేశం సాగింది. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించాను. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానన్నారు. […]
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో బయోపిక్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆయా రంగాల్లో రాణించిన ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక టాలీవుడ్ దర్శక దిగ్గజం, దర్శకరత్న దాసరి నారాయణరావు బయోపిక్ వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన బయోపిక్ పై ఓ ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో దాసరి బయోపిక్ నిర్మించేందుకు నిర్మాత తాడివాక […]
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇదివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించింది. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించడం, పైగా పర్యాటక మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటంతో కోమటిరెడ్డి ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన […]
తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ సంజయ్ గారి ధృఢ చిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ ధృడ సంకల్పం కలిగిన నేతగా నిలిపాయి. […]
నటి పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా ‘RX 100’తో టాలీవుడ్‌కు పరిచయం అయింది. తొలి సినిమాలో హాట్ హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తన నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. మొదటి సినిమాతో మరిన్ని అవకాశాలు వచ్చిన.. సరైన హిట్ రాకపోవడంతో వెనకబడిపోయింది. కథ డిమాండ్ మేరకు ఏ పాత్రకు అయినా సై అంటుంది ఈ బ్యూటీ.. ప్రత్యేక సాంగ్ లోను పాయల్ అప్పుడప్పుడు మెరుస్తోంది. ఇదిలావుంటే, ఈ అమ్మడు ప్రస్తుతం […]
(జూలై 11న రవికిశోర్ పుట్టినరోజు) బ్యానర్ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. మూడున్నర దశాబ్దాలుగా చిత్రాలను నిర్మిస్తున్నారు రవికిశోర్. తన మనసుకు నచ్చిన కథను సినిమాగా తెరకెక్కించడంలోనూ, మెచ్చిన పరభాషా చిత్రాన్ని తెలుగులోకి అనువదించడంలోనూ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. విలక్షణ దర్శకుడు వంశీతో రవికిశోర్ చిత్రప్రయాణం ఆరంభించారు. వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’ నిర్మించి, ఆ సినిమాతోనే తన అభిరుచి ఏమిటో చాటుకున్నారు. […]