కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానాతో షాకిచ్చింది. విజయ్ రోల్స్ రాయిస్ గోస్ట్ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హీరో విజయ్ 2021లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, విజయ్ పిటిషన్ ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియమ్ తోసిపుచ్చారు. […]
తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ‘నవరస’ వెబ్ సిరీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. మనిషిలోని తొమ్మిది భావోద్వేగాలను.. తొమ్మిది భాగాలుగా.. తొమ్మిది మంది దర్శకులతో ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నవరస’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా నవసర ప్రమోషన్స్ లో భాగంగా మణిరత్నం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే చాలా విషయాలు ముచ్చటించిన ఆయన.. […]
లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగులు లేక సినీతారలు తమ మిగితా టాలెంట్ ను బయటపెట్టారు. కాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ కాలంలో తన స్కిల్ ను చూపించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె లాక్ డౌన్ ముచ్చట్లను చెప్పుకొచ్చింది. ‘కొవిడ్‌తో వచ్చిన విరామ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆన్‌లైన్ లో చాలా సబ్జెక్ట్‌లలో పరిజ్ఞానం పెంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే, వాళ్ళ పనిమనిషి అబ్బాయికి ఇంగ్లిష్ పాఠాలు కూడా […]
కాలం ఎంత వేగంగా సాగిపోతోందో తెలుసు కోవాలంటే… పాత సినిమాలు విడుదలైన రోజుల్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ నిన్నోమొన్నో వచ్చినట్టే అనిపిస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రోజా’ సినిమా 1992 ఆగస్ట్ 15న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ మ్యూజికల్ హిట్ మూవీలో అందమైన జంటగా నటించారు అరవింద్ స్వామి, మధుబాల. ఆ తర్వాత కాలచక్రం వడివడిగా సాగిపోయింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించిన మధుబాల పెళ్ళి చేసుకుని […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని కాంబినేషన్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈనెల 12 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైంది. రామ్ సరసన హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి ‘ఉస్తాద్’ అనే పేరును దాదాపు ఖాయం చేసినట్లే తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు ఆర్య నటించనున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు […]
(జూలై 12తో ‘కూలీ నంబర్ 1’కు 30 ఏళ్ళు) కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా హీరోగా జనం ముందు నిలిచారు వెంకటేశ్. తొలి సినిమా సక్సెస్ తోనే ‘విక్టరీ’ వెంకటేశ్ గా జనం మదిని గెలిచారు. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ “భారతంలో అర్జునుడు, ఒంటరి పోరాటం, కూలీ నంబర్ వన్” చిత్రాలలో నటించారు. వీటి తరువాత “ముద్దుల ప్రియుడు, సాహసవీరుడు-సాగరకన్య, సుభాష్ చంద్రబోస్” చిత్రాలలోనూ రాఘవేంద్రరావు, వెంకటేశ్ కాంబో సాగింది. అయితే […]
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మానవత్వాన్ని చాటుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట ప్రాంతవాసి కార్మిక నాయకుడు, వెంకటరమణ అనారోగ్యంతో పదిరోజుల క్రితం మృతి చెందాడు. కాగా ఆయన బ్రతికుండగానే ఆయన కూతురు ఆత్మహత్య చేసుకోగా, ఆమెకు ఒక చిన్న కూతురు ఉంది. దీంతో ఆ చిన్నారి పరిస్థితి చూసి అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ చిన్నారికి అన్నివిధాలుగా అండగా ఉంటానని చిన్నారిని చదివించి ప్రయోజకురాలిని చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆ […]
సోషల్ మీడియా మోజులో పడి భార్య తనను పట్టించుకోలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫతేనగర్‌కు చెందిన మౌనిక పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో వీడియోలు అప్‌లోడ్ చేయొద్దని భర్త పవన్ కోరాడు. అయినా పట్టించుకోకపోవడంతో.. భార్య ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ నగర్‌లోని ఫతేనగర్‌కు చెందిన పవన్ కు మౌలాలికి చెందిన మౌనికతో 2015లో వివాహం జరిగింది. మొదట […]
తమిళ స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజాగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘వాలిమై’ చిత్రం నుంచి అప్డేట్ వచ్చేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ అభిమానుల్లో అనందాన్ని నింపాయి. కొద్దిరోజులుగా ‘వాలిమై’ చిత్రం అజిత్ లుక్ విడుదల చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే డిమాండ్ […]