‘యూ టర్న్’ దర్శకుడు పవన్ కుమార్ మూవీ ‘ద్విత్వ’లో ప్రముఖ నటి త్రిష నాయికగా నటించబోతోందనే వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడ కంఠీరవ రాజకుమార్ తనయుడు పునీత్ హీరోగా నటించే ఈ సినిమాలో త్రిషకు స్వాగతం పలుకుతున్నామంటూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఏడేళ్ళ క్రితం పునీత్ రాజ్ కుమార్, […]
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ‘గీతాంజలి’ మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘జయమ్ము నిశ్చయంబురా’ చిత్రంలోనూ హీరోగా నటించాడు. మొదటి సినిమాలో అంజలి నాయిక కాగా, రెండో సినిమాలో పూర్ణ హీరోయిన్ గా చేసింది. తాజాగా శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన మరో సినిమా ‘ముగ్గురు మొనగాళ్ళు’ ఈ నెల 6న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… ఈ మూడు సినిమాల పేర్లతోనూ గతంలో చిత్రాలు వచ్చాయి. ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేశారు. […]
కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రసీమలో నటీనటులు కొందరు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా తమిళ నటి, పాపులర్ బుల్లి తెర భామ సహనా పెళ్ళి చేసుకుంది. ఈ అమ్మడి వివాహం జూలై 16న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో చెన్నయ్ లోని ఓ దేవాలయంలో సింపుల్ గా జరిగింది. అయితే… ఆగస్ట్ 1న వివాహానికి సంబంధించిన వీడియోను సహన తొలిసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘డాక్టర్ వెడ్స్ యాక్టర్’ […]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. 58వ రోజు సీబీఐ విచారణ వేగంగా కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనుమానితుడు పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్ […]
(ఆగస్టు 3న కళాభినేత్రి వాణిశ్రీ పుట్టినరోజు) అనితరసాధ్యం, అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ పలు ఉపమానాలు వల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు. అలాంటి అన్ని ఉపమానాలకు సరితూగే ప్రతిభ సొంతం చేసుకున్న నటి వాణిశ్రీ. ఇది కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ, ఆమె కెరీర్ గ్రాఫ్ ను చూస్తే మరికొన్ని ఉపమానాలను సైతం జోడించాలనిపిస్తుంది. అదీ వాణిశ్రీ అభినయంలోని ప్రత్యేకత! కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రలో తొలిసారి కనిపించిన వాణిశ్రీ, ఆ తరువాత […]
ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘భూమిక’. రథీంద్రన్ ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హార్రర్ చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని టీవీలో నేరుగా ప్రసారం చేయనున్నట్లుగా ప్రకటన చేశారు. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ విజయ్ టీవీలో ప్రసారం కానుంది. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాను ప్రజలకు చేరువ చేసే వేదికలపై విడుదల చేయడం ఎంతో ముఖ్యం. అలాంటి వేదికగా స్టార్ విజయ్ […]
‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తిచేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దూకుడు పెంచాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించనుందని తెలుస్తోంది. ఈమేరకు ఆమెను […]
దివంగత బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ బయోపిక్ ప్రస్తుతం చర్చగా మారింది. మొదట్లో డ్యాన్స్ మాస్టర్ రెమో డిసౌజా సరోజ్ బయోపిక్ కోసం ముందుకొచ్చినప్పటికీ ఇప్పుడు ఆయన అఫీషియల్ గా డ్రాప్ అయ్యాడు. తాను సరోజ్ ఖాన్ జీవితకథ సినిమాగా తీయబోవటం లేదని తేల్చి చెప్పాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా బరిలోకి దిగటం తనకు ముందే తెలుసునని రెమో చెప్పాడు. ఒకవైపు డైరెక్టర్ గురించిన చర్చ జరుగుతుండగానే మాధురీ దీక్షిత్ పేరు కూడా న్యూస్ […]
బాలీవుడ్ బయోపిక్స్ ట్రెండ్ లో మరో స్పోర్ట్స్ డ్రామా యాడ్ కాబోతోంది. భారత్ తరుఫున వింటర్ ఒలంపిక్స్ లో ఆరుసార్లు పాల్గొన్న అథ్లెట్ శివ కేశవన్ జీవిత కథ తెరకెక్కనుంది. హిమాచల్ లోని మనాలీలో పుట్టిన శివ కేశవన్ ‘ల్యూజ్’ అనే మంచు క్రీడలో ఇండియా తరుఫున పాల్గొన్న మొదటి క్రీడాకారుడు. అంతే కాదు మొత్తం ఆరుసార్లు ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహించగా అందులో రెండు సార్లు… 1998, 2002 వింటర్ ఒలంపిక్స్ లో… ఒకే ఒక్కడుగా […]