ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘భూమిక’. రథీంద్రన్ ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హార్రర్ చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని టీవీలో నేరుగా ప్రసారం చేయనున్నట్లుగా ప్రకటన చేశారు. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ విజయ్ టీవీలో ప్రసారం కానుంది. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాను ప్రజలకు చేరువ చేసే వేదికలపై విడుదల చేయడం ఎంతో ముఖ్యం. అలాంటి వేదికగా స్టార్ విజయ్ టీవీని భావించాము. ఈ టీవీ ద్వారా టెలికాస్ట్ చేయడం వల్ల అనేకమంది ప్రేక్షకులకు చేరువవుతుందన్న నమ్మకం ఉందని’ తెలిపారు.