విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించింది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషించారు. కాగా, తాజాగా జగపతిబాబును ‘దశరథ్’ పాత్రలో పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో జగ్గుభాయ్ లుక్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తోంది. ‘దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది’ అనే క్యాప్షన్ ను పోస్టర్ పై రాశారు. అవినీతి రాజకీయాలను అడ్డుకుంటూ తిరుగుబాటు సాగించే కథగా ఈ చిత్రం రానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.