బాలీవుడ్ బ్యూటీ తాప్సీ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘రష్మి రాకెట్’. ఈ సినిమాలో గుజరాత్‌కు చెందిన అథ్లెట్ క్రీడాకారిణి రష్మీగా తాప్సీ కనిపించనుంది. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు తాప్సీ కఠోరమైన సాధన చేసింది. ఈ చిత్రానికి ఆకాష్ ఖురానా దర్శకత్వం వహించారు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదల అవుతుందా.. లేక థియేటర్ విడుదల అవుతుందా.. అనే చర్చలకు కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘రష్మి రాకెట్’ సినిమా జీ5 లో దసరా […]
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘ ఆకాష్ కథానాయికగా నటించగా.. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రొమోషన్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ‘మాయ.. మాయ’ లిరికల్ సాంగ్ ఆకట్టుకొంటుంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించగా.. వివేక్ […]
‘అందాల రాక్షసి’ లాంటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించింది నటి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగానే వున్నా సరైన హిట్ లేక వెనకబడిపోతుంది. ఇదిలావుంటే, ఇటీవల అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ ముచ్చటించిన ఆమె తనకు ఓ సమస్య ఉందంటూ చెప్పుకొచ్చింది. తనకు ‘ట్రిపోఫోబియా’ ఉందని తెలిపింది. కొన్ని వస్తువులు, ఆకారాలను చూసినప్పుడు తనకు తెలియకుండానే భయం కలుగుతుందని ఆమె చెప్పింది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం […]
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మనకు దూరమై వచ్చే సెప్టెంబర్ కు ఏడాది అవుతుంది. గాయకునిగా ఎన్నో జాతీయ అంతర్జాతయ అవార్డులు, రివార్డులు, గౌరవాలను దక్కించుకున్నారు బాలు. ఆయన పాట వినబడని రోజు ఉండదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు వారు ఎంతగానో గర్వించే బాలకు మెల్ బోర్న్ లో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న IFFM నివాళి అర్చించనుంది. మెల్ బోర్న్ కి చెందిన సంగీత కళాకారులు లక్ష్మీ రామస్వామి, కౌశిక్ […]
ప్రస్తుతం తారలు తమ సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఎంత మంది ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే అంత ఆదాయం మరి. అందుకే తమ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందించటంతో పాటు ఫోటోషూట్స్ పేరుతో రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పనక్కరలేదు. అందాల ఆరబోతతో ఫాస్ట్ గా ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. అక్కినేని కోడలు సమంతకు ఇన్ స్టా సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా అసాధారణ ఫాలోయింగ్ ఉంది. […]
‘నల్లమల’ చిత్రాన్ని అందించిన దర్శకుడు రవిచరణ్ తన తదుపరి ‘నగారా’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఆర్ఎమ్ నిర్మిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. నమో క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించబోతున్న ఈ సినిమా వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటుందని పోస్టర్ చూడగానే ఇట్టే అర్థం అవుతుంది. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలలో దేశవ్యాస్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో కె.జి.ఎఫ్2 ఒకటి. కెజిఎఫ్ పార్ట్ వన్ సాధించిన విజయం సీక్వెల్ పై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ హీరోగా సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. నిజానికి ఈ సినిమా జూలై […]
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చెన్నైలో ‘బీస్ట్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి తెలుగు సినిమాపై దృష్టి పెట్టనున్నాడు విజయ్. ఇదిలా ఉంటే గురువారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నైలో విజయ్ సెట్ సందర్శించాడు.ఈ సందర్భంగా ధోనీ, విజయ్ కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సహచరులతో కలిసి చెన్నైలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ […]
వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది.. హన్మకొండలో చౌరస్తాలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిన గుండు సుధారాణి లిఫ్ట్ లో ఇరుకున్నారు. హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హజరై, తిరిగి వచ్చే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది. బిల్డింగ్ యాజమాని నిపుణులను రప్పించి లిఫ్ట్ ని రిపేర్ చేయించారు. సుమారు 10 నిమిషాల పాటు మేయర్ సుధారాణి అందులోనే ఉండిపోయారు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో […]