టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘ ఆకాష్ కథానాయికగా నటించగా.. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రొమోషన్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ‘మాయ.. మాయ’ లిరికల్ సాంగ్ ఆకట్టుకొంటుంది. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించగా.. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకి మంచి స్పందన లభించింది. కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి.