దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మనకు దూరమై వచ్చే సెప్టెంబర్ కు ఏడాది అవుతుంది. గాయకునిగా ఎన్నో జాతీయ అంతర్జాతయ అవార్డులు, రివార్డులు, గౌరవాలను దక్కించుకున్నారు బాలు. ఆయన పాట వినబడని రోజు ఉండదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు వారు ఎంతగానో గర్వించే బాలకు మెల్ బోర్న్ లో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న IFFM నివాళి అర్చించనుంది. మెల్ బోర్న్ కి చెందిన సంగీత కళాకారులు లక్ష్మీ రామస్వామి, కౌశిక్ గణేశ్, అనూప్ దివాకరం, మాళవిక హరీశ్ ఆగస్ట్ 15న ఫెడ్ స్క్వేర్ లో బాలు గానం చేసిన పాటలను ఆలపించబోతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (IFFM) ఆగస్టు 12 న మొదలై ఆగస్టు 20 వరకు కొనసాగనుంది. బాలు అధ్బుతమైన గొంతుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని ఆయనపై గౌరవాన్ని వెల్లడించటానికి మాటలు చాలవని, అలాంటి లెజెండరీ సింగర్ కు నివాళి అర్పించటం గర్వకారణంగా భావిస్తున్నామని ఫెస్టివల్ డైరెక్టర్ మిటు భౌమిక్ లంగే చెబుతున్నారు.