Air India Sale: ఇప్పటి వరకు విమానయానం అంటే సంపన్నలకు మాత్రమే సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు. కానీ విమానయాన సంస్థలు సామాన్యులను కూడా విమానంలో ప్రయాణించేలా చేయాలని సాధ్యమైనంత వరకు కృష్టి చేస్తున్నాయి.
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ల్యాండర్‌ను ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విజయవంతంగా వేరు చేసింది. అంటే ల్యాండర్ ఒంటరిగా చంద్రుడి వైపు ముందుకు సాగుతోంది.
Apple Price Hike: భారీ వర్షాలు, వరదలు, విరిగిపడిన కొండ చరియల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో పండిన పంట సరఫరాలో జాప్యం కారణంగా టమాటాల తర్వాత ఆపిల్ ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. దీంతో టమాటాలు, ఇతర కూరగాయలతో పాటు పండ్ల సరఫరా కూడా దెబ్బతింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో అమానుషకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో కట్ని పోలీసులు ఓ మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టడం, మరోవైపు ఆమెపై సెక్షన్ 151 కింద తనని జైల్లో పెట్టడం కనిపిస్తుంది.
Big Boss Winner: ఎల్విష్ యాదవ్ ఇటీవల సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహించిన రీసెంట్ బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతగా నిలిచాడు. సోమవారం (ఆగస్ట్ 14) జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిషేక్ మల్హాన్ ను వెనక్కి నెట్టి ఎల్విష్ ట్రోఫీ గెలుచుకున్నాడు.
ITR Filing: దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు 31 జూలై 2023 వరకు నిర్ణయించారు. ఈ సంవత్సరం కూడా కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను జూలై చివరి రోజు వరకు చెల్లించారు.
Landslide: ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు పర్వతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి.
Boat Capsize: పశ్చిమాఫ్రికాలోని కేప్ వెర్డేలో పడవ మునిగిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. ఇక్కడి ద్వీప సమూహం తీరానికి సమీపంలో వలసదారుల పడవ సముద్రంలో మునిగి 60 మందికి పైగా మరణించారు.
Mukesh Ambani: ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను రూ. 88,078 కోట్లకు ధృవీకరించింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రకటించారు.