Boat Capsize: పశ్చిమాఫ్రికాలోని కేప్ వెర్డేలో పడవ మునిగిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. ఇక్కడి ద్వీప సమూహం తీరానికి సమీపంలో వలసదారుల పడవ సముద్రంలో మునిగి 60 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో 63 మంది చనిపోయారని అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) బుధవారం తెలిపింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 38 మందిని రక్షించారు. ఇందులో నలుగురు పిల్లలు ఉన్నారు. సోమవారం ఈ ఫిషింగ్ బోట్ అట్లాంటిక్ మహాసముద్రంలో 150 నాటికల్ మైళ్ల దూరంలో అంటే కేప్ వెర్డే ద్వీపానికి 277 కిలోమీటర్ల దూరంలో కనిపించిందని పోలీసులు తెలిపారు. స్పానిష్ ఫిషింగ్ ఓడ దానిని చూసిందని, ఆ తర్వాత అది కేప్ వెర్డియన్ అధికారులకు సమాచారం అందించిందని చెబుతున్నారు.
Read Also:Rental Houses: హైదరాబాద్‌లో అద్దె ఇండ్లకు ఫుల్ డిమాండ్.. ఓఆర్ఆర్ దాటి వెళ్ళాల్సిందే..
కేప్ వెర్డే ద్వీపం యూనియన్‌లోని స్పానిష్ కానరీ దీవుల సమూహం తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని, 56 మంది గల్లంతయ్యారని ఐఓఎం అధికార ప్రతినిధి మసేహాలి తెలిపారు. సాధారణంగా పడవ ప్రమాదం జరిగిన తర్వాత వ్యక్తులు తప్పిపోయినప్పుడు వారు చనిపోయినట్లు భావించబడుతుందని ఆయన అన్నారు. మరోవైపు ఈ పడవ సెనెగల్‌లోని ఫాస్సే బోయ్ నుండి జూలై 10న బయలుదేరిందని అందులో 101 మంది ప్రయాణికులు ఉన్నారని సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆగష్టు 7 న ట్యునీషియా తీరంలో పడవ బోల్తా పడటంతో కనీసం 11 మంది వలసదారులు మరణించారు.. ఆ ప్రమాదంలో 44 మంది గల్లంతయ్యారు. ఈ పడవలో ఉన్న 57 మందిలో ఇద్దరు రక్షించబడ్డారు. ఈ ప్రజలందరూ సబ్-సహారా ఆఫ్రికా దేశాలకు చెందినవారు. తప్పిపోయిన వలసదారుల కోసం వెతుకుతున్నట్లు అధికారి పేర్కొన్నారు.
Read Also:Post Office Scheme: పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ. 5 లక్షలు లాభం..