AP CM: ఇంటింటికీ గ్యాస్ పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభం
- శరవణ అనే ఇంటి యాజమాని ఇంటిలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- అనంతరం స్వయంగా టీ పెట్టిన ముఖ్యమంత్రి
- గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదే- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే ఇంటి యాజమాని ఇంటిలో ప్రారంభించారు. అంతేకాకుండా.. సీఎం చంద్రబాబు స్వయంగా టీ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదేనన్నారు. ఇప్పుడు దీపం-2 పథకం కింద మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సురక్షితమైన గ్యాస్ నేరుగా పైన్ లైన్ ద్వారా ఇంటికి రావడాన్ని చూస్తున్నామని చెప్పారు. ఇది చాలా మంచి పరిణామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్నాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణలో 8 శాతం వాట AG&G సంస్థ కలిగి ఉందని అన్నారు. 80 లక్షల మందికి సురక్షితమైన గ్యాస్ అందిస్తున్నారని సీఎం వెల్లడించారు.
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి మ్యాచ్‌లు అంటే..?
Also Read
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
గోదావరి బేసిన్ లో 40 శాతం గ్యాస్ లభిస్తోంది.. గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా వాడుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి గ్యాస్‌ను ఏపీకి పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు వస్తున్నాయి.. గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ముఖ్యంగా మారుతుందని తెలిపారు. పెట్రోలు, డీజిల్ సహా ఇతర వాటి వల్ల కాలుష్యం ఎక్కువ అవుతోంది.. నేచురల్ గ్యాస్, గ్రీన్ ఎనర్జీ మునుముందు కీలకంగా మారుతాయన్నారు. గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్ల టార్గెట్ గా నూతన పాలసీని విడుదల చేశాంమని చెప్పారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల విలువైన జెన్ కో, ఎన్‌టీపిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారని సీఎం అన్నారు. అలాగే.. సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ అందించేలా ప్రణాళిక చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Stock Market : ముంబై నుండి కరాచీ వరకు దయనీయ స్థితిలో స్టాక్ మార్కెట్.. దివాళా తీస్తున్న ఇన్వెస్టర్లు
త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు.. గ్రీన్ హైడ్రోజన్‌ను విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ప్రతి ఇంటికి, పారిశ్రామిక కంపెనీలకు సిఎన్ జీ గ్యాస్ ను అందించాలని కంపెనీ కోరుతున్నానన్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నానని తెలిపారు. తాను స్వయంగా సిఎన్ జీ గ్యాస్ ను ప్రారంభించి ఆ ఇంటిలో కాఫీ పెట్టానని చెప్పారు. ఆ కుటుంబానికి తానే స్వయంగా కాఫీ ఇచ్చాను.. సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నేచురల్ గ్యాస్ తో పాటు నేచురల్ ఫుడ్ కూడా ఉండాలి.. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన AG&G సంస్థ అభినందిస్తున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!