Bengaluru: 4వ తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. గురువుగారి నిర్వాకం అంతా సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. 30 నిమిషాల్లో ఉపాధ్యాయుడు 23 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. అయితే వచ్చే వారమే గురువుగారి వివాహం జరగనుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఒక చిన్నపిల్లాడిని కొట్టడమే తప్పంటే.. అలాంటిది 23సార్లు కొట్టాడంటే.. ఈ వార్త విన్నవారు అయ్యో పాపం అంటున్నారు. ఆ పాపపు టీచర్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: వేణు స్వామితో మరో హీరోయిన్ రహస్య పూజలు..?
వైట్‌ఫీల్డ్ సమీపంలోని చన్నసంద్రలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయుడు విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల డైరీలో సూచనలను రాసి తల్లిదండ్రులకు పంపమని పిల్లవాడు ఉపాధ్యాయుడిని కోరాడు. అయితే చిన్నారి మాట్లాడినందుకు విసిగిపోయిన టీచర్ 23 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. అంతకుముందు ఉపాధ్యాయుడు తన ఇంట్లో విద్యార్థితో పని చేయించుకునేవాడని.. అదే విషయం ఆ బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టాడు. అయితే విద్యార్థిని 23 సార్లు కొట్టడంతో చెంపకు గాయమైంది. చిన్నారి చెంపై వాపు కనిపించడంతో తల్లి గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి ఏమైందంటూ విద్యార్థిని ప్రశ్నించగా.. జరిగిన సంఘటన అంతా చెప్పాడు. తల్లి వెంటనే చిన్నారి తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో మరుసటి రోజు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని.. పాఠశాల అధికారులకు మొత్తం విషయాన్ని చెప్పారు.
Read Also: Monsoon: 62 ఏళ్ల తర్వాత తొలిసారి.. ఢిల్లీ, ముంబై చేరిన రుతుపవనాలు
తమ ప్రశ్నలకు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఎవరూ సమాధానం చెప్పలేదని తల్లిదండ్రులు తెలిపారు. అయితే ఆ గొడవను గమనించిన పాఠశాల ఉపాధ్యాయలు.. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిని ఇంటికి పంపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించిన తల్లిదండ్రులు.. పాఠశాలకు వచ్చారు. అక్కడ ఏం జరిగిందో మొత్తం వివరాలను సేకరించారు. అంతేకాకుండా పాఠశాల సిబ్బందిని సీసీటీవీ ఫుటేజీని అడిగారు. అయితే ఆ ఫుటేజీలో 30 నిమిషాల వ్యవధిలో టీచర్ చిన్నారిని 23 సార్లు కొట్టినట్లు కనిపడింది. దీంతో నిందితుడు టీచర్‌తో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ మరికొందరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.