Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో కత్తి పోట్లు కలకలం దుమారం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టపగలే కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. జనాలు చూస్తు్ండగానే ఆ దుండగులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ఆ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Also: Sri Ranga Neethulu first look: ఆకట్టుకుంటోన్న `శ్రీరంగనీతులు` ఫస్ట్‌లుక్ పోస్టర్
అయితే ఈ దాడి ఘటనకు గల కారణాలు పాత గొడవలే అని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు సంఘటన స్థలంలోనే దుండగులు వచ్చిన బైకులు, వారు వాడిన కత్తి అక్కడే ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పట్టపగలే.. ఇలా కత్తులతో దుండుగులు కత్తులతో వీరంగం సృష్టించడంపై ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది.