Bidar: ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులు.. రూ.93 లక్షలతో జంప్
- బీదర్‌లో దోపిడీ దొంగల బీభత్సం
- ఏటీఎంలో డబ్బులు ఫిల్ చేసే వాహనాన్ని దోపిడీ చేసిన ముఠా
- వాహన భద్రతా సిబ్బందిపై దోపిడీ దొంగల కాల్పులు
- కాల్పుల్లో ఒక సెక్యూరిటీ గార్డ్ మృతి, ఇద్దరికి బుల్లెట్ గాయాలు
- రూ.93 లక్షల నగదు పెట్టెతో నిందితులు పరార్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బుల కోసం ఎంతటిదానికైనా తెగిస్తున్నారు దొంగలు.. ఇంతకుముందు ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏటీఎం సెంటర్లను టార్గెట్ గా చేసుకుని డబ్బులు కాజేస్తున్నారు. గతంలో చాలా ఘటనలు చూశాం.. ఏటీఎంలలో సీసీ కెమెరాలు తీసేసి, ఏటీఎంలో ఉన్న నగదును ఎత్తుకెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా.. ఏటీఎం బాక్సులకు బాక్సులు దొంగలించిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా.. బీదర్ లో పట్టపగలే దారి దోపిడీకి పాల్పడ్డారు దుండుగులు. వివరాల్లోకి వెళ్తే…….
Read Also: Kaushik Reddy: ఆరు గ్యారంటీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తాం.. కడుగేస్తాం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనం సిబ్బందిపై కాల్పులు జరిపారు. బైకుపై వచ్చిన ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నగదు పెట్టెతో దొంగలు పరారయ్యారు. అందులో రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఈ ఘటన జరిగింది. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను వెతికే పనిలో పడ్డారు.
Read Also: Manchu Family : నేను గొడవలు చేయడానికి రాలేదు : మంచు మనోజ్
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!