CM Chandrababu: ఐటీ తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు.. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది
- అభివృద్ధి వల్ల సంపద వస్తుంది- చంద్రబాబు
- సంపద వల్ల సంక్షేమం సాధ్యమవుతుంది- సీఎం
- విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చా- చంద్రబాబు
- ఐటీ తిండి పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేసారు- సీఎం
- ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకు వెళ్ళిపోతుంది- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ అనుభవంతో ప్రజలకు సంపదను సృష్టిస్తా అని చెప్పా.. అభివృద్ధి వల్ల సంపద వస్తుందని సీఎ చంద్రబాబు అన్నారు. సంపద వల్ల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. 1991లో ఆర్ధిక సంస్కరణలు వచ్చాయి.. 1993లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చానన్నారు. రాష్ట్రానికి వెలుగులు ఇచ్చి తాను అధికారం కోల్పోయానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసాం.. రహదారుల విస్తరణ 14 లైన్ల వరకు వెళ్ళిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల ఆదాయం బాగా పెరిగిందని తెలిపారు. ఐటీ తిండి పెడుతుందా అని చాలా మంది ఎగతాళి చేసారు.. ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకు వెళ్ళిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇండియాలో ఆధార్ వ్యవస్థ బాగా బలంగా ఉంది.. ఆయుష్మాన్ భారత్, రైతు భరోసా అన్నిటికీ ఆధార్ ఉండాలన్నారు. ప్రతి ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు.. సంపద సృష్టికి P4 విధానం తెస్తున్నామని సీఎం తెలిపారు. P4 అనేది గేమ్ ఛేంజర్ గా మారుతుందని చెప్పారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొన తొలగింపు!
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
తాము తయారు చేసిన విజన్ డాక్యుమెంట్‌కు 16 లక్షల మంది ఆన్‌లైన్‌లో తమ అభిప్రాయాలు చెప్పారని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం ఏపీకి లైఫ్ లైన్ అని అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం.. వెల్తీ, హెల్తీ ఫ్యామిలీనే తన గోల్ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు నిరంతరం పని చేస్తాను.. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సంపద పెరిగితే వ్యక్తిగత సంపద పెరుగుతుంది.. అమెరికాలో ఉండే తెలుగు వారి ఆదాయం బాగా పెరుగుతోందని పేర్కొన్నారు. అన్నిటికంటే అభివృద్ధి అనేది కీలకం.. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి.. వ్యక్తిగత ఆదాయం పెరగాలి.. ఆరోగ్యం బావుండాలి.. ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో టూరిజం 20 శాతం గ్రో అయ్యే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దెలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. గడచిన కొన్నేళ్ళుగా 10 శాతం మాత్రమే వృద్ధి రేటు ఉంది.. ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా 15 శాతంగా వృద్ధి రేటు చేరితే జీఎస్డీపి 347 లక్షల కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
Read Also: Saif Ali Khan: మా బెడ్‌రూమ్‌కి రండి.. అప్పట్లో వారిపై సైఫ్ అసహనం!
తలసరి ఆదాయం 58 లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది.. ప్రజలకు ఇవన్నీ అర్థం కాకపోయినా వారి జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న అంశం ఇది అని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎస్డీపీ రూ. 16,06,109 కోట్లుగా ఉంది.. 12.94 శాతం వృద్ధిరేటు ఉంది.. 2014-19 మధ్య 13.5 శాతం వృద్ధి రేటు నమోదు అయ్యింది.. 2019-24 మధ్య అది 10.93 శాతానికి మాత్రమే పరిమితం అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే ఏపీ వృద్ధి రేటు 2.8 శాతం ఎక్కువగా నమోదు అయిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ప్రకారం 3,169 డాలర్ల తలసరి ఆదాయం ఉందని చెప్పారు. ప్రస్తుత ధరల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,68,653 తలసరి ఆదాయం నమోదు అయిందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 15.86 వృద్ధి నమోదు అయ్యింది.. ఆక్వా కల్చర్ రంగంలోనూ ఎక్కువ వృద్ధి నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దేశంలో జనాభా తగ్గుతోంది.. సౌత్ ఇండియా జనాభాలో డేంజర్ జోన్‌లో ఉంది.. సంపద కాదు జనాభాను కూడా సృష్టించాలన్నారు. సంపదతో పాటు జనాభా సృష్టి జరగాలని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!