V. Hanumantha Rao: ఖమ్మం జిల్లా తల్లంపాడు నుండి సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర ప్రారంభం అయింది. కోదాడ క్రాస్ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగింది. తల్లం పాడులో భట్టి పాదయాత్ర 1360 కీ.మీ పూర్తి చేసుకుంది. అందులో భాగంగా.. స్మారక స్థూపంని గద్దర్, భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. మరోవైపు భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రపై కాంగ్రెస్ నేత వీ.హనుమంత రావు మాట్లాడారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయి
భట్టి పాదయాత్ర చరిత్రాత్మక విషయమని వీహెచ్ కొనియాడారు. భట్టి పట్టుదలతో పని చేస్తున్నారని తెలిపారు. బీసీ ప్రధాని అయినా.. బీసీల కోసం ఏం చేశాడని ప్రశ్నించారు. కులాల వారిగా జనాభా గణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారని వీహెచ్ అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని.. ఖమ్మంలో 10 సీట్లు కాంగ్రెస్ దే అన్నారు. రేవంత్, భట్టి కలిసి పని చేయాలని ఆయన అన్నారు. బలగం సినిమా చూశానని.. 30 ఏండ్ల విడిపోయిన కుటుంబాలు కలుస్తున్నాయని.. మనం ఎందుకు కలవద్దని వీహెచ్ అన్నారు. కలిసి పని చేసి అధికారంలోకి వద్దామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Uniform civil code: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో “యూనిఫాం సివిల్ కోడ్” బిల్లు.!
మరోవైపు మోడీ ఔట్.. రాహుల్ ఇన్ కావాలని వీహెచ్ అన్నారు. సోనియాగాంధీ కాళ్ళు కడిగి నువ్వేం చెప్తే అదే అన్న కేసీఆర్.. ఇప్పుడేమో కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో వేస్తా అంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ కు అంతుందా అని వీహెచ్ అన్నారు.
మరోవైపు ఖమ్మంలో రాహుల్ సభకు మంత్రి పువ్వాడా బస్సులు ఇయ్యడు అంటా.. బస్సులు ఇవ్వకపోతే జనాలు నడుసుకుంటు వస్తారని వీహెచ్ తెలిపారు.