Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం సభపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. జులై 2 న ఖమ్మంలో సభ పెట్టాలని అధిష్టానం ఆదేశించిందని తెలిపారు. అందుకోసం సభ ఏర్పాట్ల పరిశీలనకై ఖమ్మం వచ్చానని రేవంత్ పేర్కొన్నారు. ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పకడ్బందీగా చేస్తున్నారని ఆయన వెల్లడించారు. భారీ ఎత్తున సభ కోసం పొంగులేటి ఆర్టీసీ బస్సులు అడిగారన్నారు. ఆర్టీసీ అధికారులు ముందు బస్సులు ఇస్తామని, ఇప్పుడు బస్సులు ఇవ్వలేమని చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఇచ్చిన ఇవ్వకున్నా సొంత వాహనాల్లో సభకు రావాలని రేవంత్ పిలపునిచ్చారు.
Read Also: Disha Patani: బాబోయ్.. ఇంత హాట్ అయితే తట్టుకోవడం కష్టమే..
భట్టి విక్రమార్క వెయ్యి కిలోమీటర్లు నడిచి ఖమ్మంలోకి వస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఖమ్మం సభ విజయవంతం కాకుండా ఏమాత్రం అడ్డుకోలేరన్నారు. ఎవరు అడ్డుకున్న తొక్కుకుని జనగర్జన సభకు రండి అని రేవంత్ పిలుపునిచ్చారు. ఇంటెలిజెన్స్ అధికారులు వీడియోలు తీసి సీఎం కేసీఅర్ కి పెట్టండని అన్నారు. జనగర్జన సభ నుండి BRS కు సమాధి కడతామని రేవంత్ పేర్కొన్నారు. మరోవైపు మా అక్క రేణుకమ్మ, భట్టి విక్రమార్కలు కాంగ్రెస్ కి రెండు కళ్లు అని.. పొంగులేటి మూడో కన్ను అని అన్నారు. మూడో కన్ను తెరిచిన శివుడిలా ఖమ్మం జిల్లా నుండి విజయయాత్ర ప్రారంభం కావాలని రేవంత్ తెలిపారు.
Read Also: Captain Miller: ఫ్రీడమ్ కు గౌరవమివ్వమంటున్న ధనుష్
అంతేకాకుండా మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో వుంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ బర్త్ డే రోజున తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఏర్పడుతుందని.. ఇప్పుడున్నది శాంపిల్ గవర్నమెంట్ అని విమర్శించారు. ఖమ్మం జనగర్జన సభ ద్వారా కారుగుర్తును బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పోడు భూములపై చేసాడని.. కాంగ్రెస్ పార్టీ నేత పోరాటాల వల్లనే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములను ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.