HDFC-HDFC Bank Merger : హెచ్‌డిఎఫ్‌సి ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గవ అత్యంత విలువైన బ్యాంకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తియింది. దీంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రంపంచంలో నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. విలీనం తర్వాత కంపెనీ సైజు ఎంత పెరుగుతుంది, లాభాలు ఎలా ఉన్నాయి, షేర్ల కేటాయింపు, ఉద్యోగుల సంఖ్య ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బోర్డ్స్ ఆఫ్ డైరెక్టర్లు తమ విలీన ప్రతిపాదనను శనివారం అమోదించారు. విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తి కావడంతో 44 ఏళ్ల సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ జూలై 1 నుంచి కనుమరుగు కానుంది.
Read Also: Ustaad Bhagat Singh: ఈ కాంబో పై అంచనాలు కూడా మారవు.. వెయిటింగ్
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ఈ విలీనంతో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. జెపీ మోర్గాన్ చేస్ అండ్ కో, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (ఐసీబీసీ), బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్ప్‌ల తర్వాతి స్థానంలో ఉంది. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ దాదాపు 172 బిలియన్ డాలర్లుగా ఉంది. విలీన సంస్థ మొత్తం వ్యాపారం మార్చి 2023 చివరి నాటికి రూ. 41 లక్షల కోట్లుగా ఉంది. విలీనంతో సంస్థ నికర విలువ రూ. 4.14 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ప్రతిపాదిత సంస్థ దాదాపు రూ. 18 లక్షల కోట్ల ఆస్తులను కలిగి ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర విలువ పెరగడంతో ఆర్థిక వ్యవస్థలోకి ఎక్కువ క్రెడిట్ ప్రవాహాన్ని అనుమతిస్తుందని సంస్థ తెలిపింది. ఇది మౌలిక సదుపాయాల రుణాలతో సహా పెద్ద రుణాలను అందించి దేశ నిర్మాణానికి, ఉపాధి కల్పనకు మరింత దోహదం చేస్తుందని పేర్కొంది.
రెండు సంస్థల ఉమ్మడి లాభం మార్చి 2023 చివరి నాటికి దాదాపు రూ. 60,000 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ ట్విన్స్ ఉమ్మడి షేర్లు సూచీలపై అత్యధికంగా 14 శాతానికి దగ్గరగా వెయిటేజీని కలిగి ఉంటాయి. ఇది ప్రస్తుత ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.4 శాతం వెయిటేజీతో పోల్చితే చాలా ఎక్కువ. విలీనంతో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఉద్యోగులు ఇకపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులుగా మారుతారు. కొత్త సంస్థ దాదాపు 12 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉంటుంది. ఇది జర్మనీ జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. విలీనంతో హెచ్డీఎఫ్సీ బ్రాంచీలు 8,300 కి పెరుగుతాయి. మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,77,000 కంటే ఎక్కువగా ఉంటుంది.
హెచ్డీఎఫ్సీ విలీనం భారతదేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా నిలిచింది. విలీనం పూర్తి కావడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్‌ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత వాటాదారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 41 శాతం కలిగి ఉంటారు. 25 షేర్లను కలిగి ఉన్న హెచ్డీఎఫ్సీ వాటాదారులు 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లను పొందుతారు.
- Tags
- bank
- business news
- HDFC
- valuable
- world
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!