Zim Afro T10: జిమ్ ఆఫ్రో టీ10 లీగ్లో సత్తా చూపని భారత వెటరన్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేలో జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్ ప్లేయర్స్ కొద్దోగొప్పో ప్రదర్శన మాత్రమే చూపిస్తున్నారు. ఈ లీగ్‌లో మొత్తం భారత్ కు చెందిన ఆరుగురు వెటరన్లు పాల్గొన్నారు. ఐతే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన చూపలేకపోయారు. నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే హరారేకు చెందిన ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ (4), బౌలింగ్ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా ఫెయిలయ్యాడు. చెప్పుకోదగ్గ వారిలో హరారే ఆటగాడు రాబిన్ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు.
Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Also Read
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
కేప్ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ సాంప్ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్ (25) స్కోర్ చేశాడు. దీంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 పరుగులు చేయగా.. హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 97/6 స్కోర్ చేసి 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. డర్బన్ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం నిరాశపరిచాడు. యూసఫ్ 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్.. టామ్ బాంటన్ (55 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. డర్బన్ ఖలందర్స్ మరో 5 బంతులు ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్ లో హజ్రతుల్లా జజాయ్ (41 నాటౌట్) విజృంభించడంతో డర్బన్‌ను గెలిపించాడు.
CM KCR: మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ
నిన్న జరిగిన మరో మ్యాచ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్ ఆర్మీని గెలిపించాడు. కాగా.. జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ (కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ), రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ (హరారే హరికేన్స్), యూసఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) జట్ల తరుపున ఆడుతున్నారు.
తాజావార్తలు
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?