దేశవ్యాప్తంగా నేడు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ఆయా రాష్ట్రాల్లో సీఎంలు, ముఖ్య నేతలు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా.. భారతీయులు జాతీయజెండాను ఎగురవేసి సెల్యూట్ చేసి దేశ భక్తిని చాటుకుంటున్నారు. భారత్ మాతాకీ జై అంటూ ఘనంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగమూర్తులను స్మరించుకున్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఘనంగా జరుపుకున్నారు.
Mohan Babu: ఆ మాట అంటే చెప్పు తీసుకుని కొడతానన్నా!
మరోవైపు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీపా భవనంపై భారతదేశ జెండాను ప్రదర్శించారు. సరిగ్గా అర్థరాత్రి 12.01నిమిషాలకు ఎల్ఈడీ లైట్లతో మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. అంతేకాకుండా జాతీయ గీతాలాపన కూడా చేశారు. ఇలాంటి సన్నివేశాన్ని చూసిన ప్రతి భారతీయుడు ఆనందంతో పొంగిపోయారు. అంతేకాకుండా మేము భారతీయులం అంటూ చాటుకున్నారు. మరోవైపు ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూస్తే.. గూస్ బంప్స్ రావడం ఖాయం.
Bhagavanth Kesari: అన్న హరికృష్ణ సినిమానే బాలయ్య రీమేక్ చేస్తున్నాడా?
ఇదిలా ఉండగా.. నిన్న(ఆగష్టు 14)న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. అయితే పాకిస్తాన్ జెండాకు ఘోర అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే దేశాల జాతీయ జెండాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి పాకిస్తాన్ జెండాను ప్రదర్శించలేదు. దీంతో పాకిస్తానీలు తీవ్ర నిరాశ చెందుతూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జాతీయ జెండాకు అవమానం జరిగిందంటూ ఆవేదన చెందుతున్నారు. దీంతో దుబాయ్ అధికారులపై పాకిస్తానీలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే బుర్జ్ ఖలీఫాపై భారత జెండా ప్రదర్శనపై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు పాకిస్తానీలు నిరాశకు గురైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Indian flag on Burj Khalifa.
Happy Independence to all…!!!! 🇮🇳 pic.twitter.com/iyTKILAoj4
— Johns. (@CricCrazyJohns) August 14, 2023