Rahul Gandhi: జీ- 20కి సంబంధించిన విందుకు ఆహ్వానంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘భారత రాష్ట్రపతి’ అని సంబోధించడంపై రాజకీయ వివాదం నెలకొంది. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు రాజకీయ ప్రముఖులు ఈ అంశంపై స్పందించగా.. వారి వారి అభిప్రాయలను వ్యక్తపరిచారు. మరోవైపు ప్రతిపక్షం ఈ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే.. బీజేపీ తిరిగి కౌంటరిస్తుంది.
Read Also: Tomato Price: రోజురోజుకు దిగజారుతున్న టమాటా ధర.. కిలో రూ.4 మాత్రమే!
తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. భారత్, ఇండియా అంటే ప్రేమ అని అన్నారు. దేశాన్ని ఇండియా అనే పేరు నుంచి భారత్ అనే పేరుకు మార్చాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. అంతేకాకుండా.. రాహుల్ తన ‘భారత్ జోడో యాత్ర’కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేస్తూ.. “భారత్, ఇండియా ఏదైనా.., ప్రేమ, ఉద్దేశ్యం అత్యున్నత విమానం” అని రాశారు.
Read Also: Madhya Pradesh : కట్నం కోసం నీచానికి దిగజారిన భర్త.. తాడు కట్టి బావిలోకి తోసి..
భారత్ జోడోయాత్ర గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమై ఈ ఏడాది జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. ఈ యాత్ర 145 రోజుల పాటు సాగింది. ఈ యాత్రలో పలువురు నేతలతో కలిసి రాహుల్ గాంధీ 4,000 కిలోమీటర్లకు పైగా నడిచారు. అంతేకాకుండా వివిధ వర్గాల ప్రజలతో కూడా మమేకమయ్యారు.
Read Also: Harish Rao : ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారు
ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ యూరప్ లో పర్యటిస్తున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి యూరప్‌కు వెళ్లిన ఆయన.. వారం రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తిరిగి సెప్టెంబర్ 11న భారత్‌కు రానున్నారు.