Crocodiles die: రైలు ఢీకొని రెండు మొసళ్లు చనిపోయిన ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌లో జరిగింది. బగాహా-వాల్మీకినగర్ రోడ్ రైల్వే స్టేషన్ మధ్య మంగళ్‌పూర్ ఔసాని హాల్ట్ సమీపంలో మొసళ్లను రైలు ఢీకొనడం కనిపెట్టారు. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ప్రమాదంలో ఓ మొసలికి రెండు కాళ్లు విరిగిపోయాయి. అనంతరం వాటిని పరిశీలించిన అధికారులు.. వాటి మృతదేహాలను బగాహ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అక్కడ వాటికి పోస్ట్‌మార్టం నిర్వహించి.. మృతదేహాలను ఖననం చేశారు. అయితే వాటిని ఏ రైలు ఢీకొందని అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Also: ODI WC 2023: ఆసియా కప్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి..!
ఈ ఘటన తెలుసుకున్న స్థానిక ప్రజలు అక్కడికి చేరుకుని వాటి గురించి చెప్పారు. మొసళ్లు రెండు ఎప్పుడూ కలిసి ఉండేవని.. ఎటు తిరిగినా కలిసి ప్రయాణించేవని అంటున్నారు. తాము ఎప్పటికి ఆ ప్రదేశంలోనే చూస్తుంటామని చెప్పారు. ఇంతకు ముందు కూడా అవి చాలాసార్లు రైల్వే లైన్‌కి మీదకు వచ్చేవని.. కానీ దురదృష్టంశాత్తు ఇప్పుడు చనిపోయాయని వారు బాధను వ్యక్తం చేశారు. చెరువులో నుంచి బయటకు వచ్చిన మొసళ్లు.. రైలు మార్గానికి సమీపంలో ఉన్న గొయ్యి వద్దకు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో.. రైలు వాటి మీద నుండి వెళ్లడంతో ఒక్కటి నుజ్జునుజ్జు కాగా.. మరోదాని రెండు కాళ్లు విరిగిపోయాయి.
Read Also: Ganja Smuggling: ఏవోబీలో ‘పుష్ప’ను మించిన సీన్.. పోలీసులకు సెల్యూట్