వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు.. ఇండియాకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వీసా సమస్యలు ఎదుర్కొంటుండగా.. తాజాగా శుభవార్త అందింది. ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయనున్నారు.
శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్ కు ఆ స్టార్ ప్లేయర్ దూరం కానున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా.. శ్రీలంక మెయిన్ స్పిన్నర్ వనిందు హసరంగా. అతని గాయంపై మెడికల్ ప్యానెల్ హెడ్ అర్జున డి సిల్వా అప్‌డేట్ ఇచ్చాడు.
చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునే సమయం త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పెద్దనోట్లను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెడ్ లైన్ విధించింది. అయితే ఇంకెంతో సమయం లేదు.. కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 2000 రూపాయల నోట్లను మార్చుకోకపోతే.. వెంటనే మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్చుకోండి.
ఆసియా క్రీడలు 2023లో టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టు పసిడిని ముద్దాడింది. మహిళల క్రికెట్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో శ్రీలంకపై భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను 20 ఓవర్లలో 97 పరుగులకే పరిమితం చేసి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్ తర్వాత గిల్, అయ్యర్ ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడారు. ఆ వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. అందులో గిల్, శ్రేయాస్ అయ్యర్ ఒకరి గురించి ఒకరు సమాధానాలు చెప్పుకుంటారు.
ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు మయన్మార్ సవాల్‌ను ఎదుర్కొంది. భారత్-మయన్మార్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అయినప్పటికీ భారత జట్టు ప్రీక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ 99 పరుగుల తేడాతో గెలిచింది. 217 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 3 వికెట్లు, అశ్విన్ కు 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలిచి భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.
బీహార్ లోని పిదాసిన్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు నిరంజన నదిలో స్నానానికి వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడార. అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. మరోవైపు నదిలో గల్లంతైన ఇద్దరు బాలికల కోసం గాలిస్తున్నారు.
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ను చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కరెంట్ షాక్ తో ఇబ్బందులకు గురిం చేశారు. అంతేకాకుండా కిడ్నాపర్లు గేదెల పేడను నోటిలో వేసి.. ముక్కుపై షూ రుద్దడంతోపాటు ఉమ్మి కూడా వేశారు. అయితే ఈ అరాచకాన్ని మొత్తం ఫోన్లలో వీడియో కూడా తీశారు కిడ్నాపర్లు.
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎదురుదాడి చేశారు. హిమంత బిస్వా శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రేమ మాత్రమే ఉంది, ద్వేషం లేదు, ప్రేమ దుకాణం వంటి పదాలు తమ నిఘంటువులో లేవన్నారు. ఈ ప్రేమ దుకాణం ఓట్ల కోసం మాత్రమేనని విమర్శించారు.