గుజరాత్‌లోని తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య నడిచే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రైలు నుంచి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అక్కడి ప్రభుత్వంలో మరో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఐదుగురిని ఉపముఖ్యమంత్రులను చేసే విషయమై చర్చిస్తున్నామని రాయరెడ్డి తెలిపారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. శనివారం అక్కడ జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం జైపూర్‌లో కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమి (INDIA) పేరుపై వివాదాన్ని చర్చించడానికి ప్రధాని మోడీ ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌ను ప్రకటించాడన్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
పంజాగుట్ట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ ప్రీ వెడ్డింగ్ షూట్‌పై సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి వివాదాన్ని సృష్టించింది. అయితే కొత్తగా పెళ్లయిన పోలీసు జంట సీపీ సీవీ ఆనంద్ ను కలిశారు. అనంతరం నవ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మొన్న జరిగిన ఫ్రీ వెడ్డింగ్ షూట్‌పై స్పందిస్తూ.. వ్యక్తిగత వేడుకలకు యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ గుర్తు చేశారు. అంతేకాకుండా పోలీస్ శాఖను ఇబ్బంది పెట్టినందుకు నవ దంపతులు…
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. 277 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. చివరకు ఆడి గెలిపించారు.
ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 4న ప్రారంభంకానుంది. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ICC T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్‌లలో జరుగనున్నాయి. తొలిసారిగా అమెరికా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది.
లోక్‌సభ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి కించపరిచే పదజాలం వాడిన అంశం ఊపందుకుంది. ఈ విషయంపై రాజకీయ ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. డానిష్ అలీ ఇంటికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అతన్ని కౌగిలించుకుని చాలాసేపు మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ ఎక్స్‌లో పంచుకున్నారు.