రేపు (ఆదివారం) చెన్నై వేదికగా వరల్డ్ కప్లో భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలనే కసితో భారత్ బరిలోకి దిగుతుంది. మరోవైపు రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలుపొంది.. శుభారంభాన్ని అందించాలని అనుకుంటుంది. ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుకు మంచి రికార్డులు ఉన్నప్పటికీ.. రేపటి మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజూరయ్యాయి. కొంతకాలం క్రితం శిఖర్ ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ మానసికంగా హింసించిందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్ ధావన్ వాదనలను సమర్ధించింది.
సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. లొనాక్ సరస్సుపై మేఘాలు విస్ఫోటనం చెందడం వల్ల అది పొంగిపొర్లడంతో తీస్తా నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 10 మంది మృతి చెందారు. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 82 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా వరదల దాటికి 14 వంతెనలు కూలిపోయాయి.
అందరూ డబ్బులను పర్సులో పెట్టుకునే అలవాటు ఉండే ఉంటది. అంతవరకూ ఓకే.. కానీ ఆ పర్సును మనం వెనక ప్యాంట్ జేబులో పెట్టుకోవడం ముప్పు అని ఎవరికి తెలియదు. చాలామంది పర్సు లేదా వాలెట్‌ని మగవారు లేదా స్త్రీలు బాక్ పాకెట్‌లోనే పెట్టుకుంటుంటారు. ఐతే అలా పెట్టకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరికొన్ని గంటల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన A to Z వివరాలివే.
వన్డే ప్రపంచకప్ గెలవడం ఎంత ముఖ్యమో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా అంతే ముఖ్యమని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. సామాన్యుడు పోటీని చాలా మక్కువతో పట్టించుకుంటాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఆసియా గేమ్స్ లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చూపిస్తున్నారు. ఇప్పటికే 17 బంగారు పతకాలను సాధించగా.. భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. దీంతో భారత్ 18 బంగారు పతకాలు సాధించింది. జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తాను మరోసారి అద్భుత ప్రదర్శన చేసి.. టీమిండియాకు బంగారు పతకాన్ని అందించాడు.
ఆపిల్ ఐప్యాడ్ రూ. 20 వేలకు పొందుతారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. Apple ఐప్యాడ్ 9వ మోడల్.. అసలు ధర ఈ-కామర్స్ సైట్‌లో దాదాపు రూ. 30,990 నుండి రూ. 33,990 ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో ఆపిల్ ఐప్యాడ్‌ను కేవలం రూ. 20,000కే కొనుగోలు చేయవచ్చు.
బరువులు ఎత్తి టైటిల్స్ గెలుపొందిన వారు ఉన్నారు. జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.. కేజీలు కేజీలు బరువులు లేపేవాళ్లు ఉన్నారా. అంతేకాకుండా చాలా మంది చాాలా మంది బరువులను మోస్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఓ వ్యక్తి తన తలపై ఓ బీరువాను పెట్టి తిరుగుతున్నాడు. అది కూడా మాములుగా కాదు ఓ సైకిల్ పై.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ముందు క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం లేదు. స్పోర్ట్స్ వెబ్‌సైట్ రెవ్ స్పోర్ట్స్ ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బోర్డు ఈసారి ఈ వేడుకను నిర్వహించడం లేదని తెలుస్తోంది.