చిన్న టీమే కదా అని అంచనా వేస్తే.. సునామీ సృష్టించారు. ఆసియా క్రీడల్లో బంగ్లాతో జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో పసికూన మలేషియా.. బంగ్లాదేశ్ ను ఓడించినంత పని చేశారు. ఒకానొక సమయంలో ఈ మ్యాచ్ మలేషియా గెలుస్తుందని అనుకున్నప్పటికీ.. అఫీఫ్ హొస్సేన్ ఆల్‌రౌండ్ షో చేశాడు. బ్యాటింగ్ లో14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులతో చెలరేగగా.. బౌలింగ్ లో 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను ఆదుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు.. సెమీ ఫైనల్ లోనే ఓటిమిని చవిచూడల్సి వచ్చింది. కానీ ఈసారి ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించింది. దీంతో.. భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది.
డేవిడ్ భాయ్ బ్యాటింగ్లో ఇరగదీస్తాడన్న విషయం అందరికి తెలుసు. కానీ బౌలింగ్ కూడా చేస్తాడన్నది ఎవ్వరికి తెలియదు. అతని బౌలింగ్ చూస్తే.. అచ్చం రెగ్యూలర్ బౌలర్ లానే కనపడ్డాడు. ప్రస్తుతం వార్నర్ బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం పీఆర్సీ పెంచడం దారుణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇదేనా ఉద్యోగులను కడుపులో పెట్టుకునే చూసుకునే విధానమని విమర్శించారు. దేశంలోనే ధనిక రాష్ట్రంలో ఏమిటి దారుణమని ప్రశ్నించారు. వెంటనే 20% ఐఆర్ ప్రకటించాలన్నారు.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ బండారం బయటపెడితే ముఖ్యమంత్రి కుమారుడు అంత ఉల్లిక్కి పడుతున్నారు ఎందుకని డీకే అరుణ విమర్శించారు. బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ లో స్పందించారు. మోడీ చెప్పినట్లుగా NDA లో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు.. నిజమై తప్పక ఉండి ఉంటదని తెలిపారు.
ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారన్నారు. కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎవరికి కావాలని విమర్శించారు.
సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము... డబ్బులు ఇచ్చింది మేమన్నారు. ఈ విజయం తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది...ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదని హరీష్ రావు అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని.. ఈసారి అదే గతి పడుతుందని అన్నారు. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే అని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కోవిడ్ తరువాత మోడీ హైదరాబాద్ వచ్చారని.. అప్పుడు సీఎం కేసీఆర్ ను మోడీనే వద్దన్నారని వినోద్ కుమార్ తెలిపారు. కేసీఆర్ అంటే మోడీకి ఇష్టం లేదని ఆరోపించారు. GHMC ఎన్నికలకు మోడీ పర్యటనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గురించి మోడీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ను చూసి మోడీ భయపడుతున్నారని చెప్పారు.